అలా ఉండాలనుకోవాడమే శ్రీదేవికి శాపంగా మారిందా?

Monday, February 26th, 2018, 12:20:42 PM IST

శ్రీదేవి హఠాన్మరణంతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. భారత చిత్రసీమ బాధలో మునిగింది. ఆమె శనివారం రాత్రి గుండె హఠాత్తుగా ఆగిపోయి మృతి చెందారు. ఊహించిన పెను ఉప్పెనై ముంచెత్తి గుక్కతిప్పుకోనీయకుండా చేసి గుండె చప్పుడును ఆపేసి ప్రాణాలను హరించేసే కార్డియాక్‌ అరెస్ట్‌ ఒక్కోసారి ముందస్తు సంకేతాలు కూడా ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వాస్తవానికి అయితే, గుండెపోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయి.

ఒక రకంగా వికారంగా అనిపించడం, అలసట, వెన్నునొప్పి, మెడ, భుజాల నొప్పులు కూడా రాబోయే గుండెపోటుకు సంకేతాలే కావచ్చుఅధికరక్తపోటు, మధుమేహం, ధూమపానం, కొలెస్టరాల్‌ స్థాయులు అధికంగా ఉండటం అసలు ఏ విధమైన శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం వంటివి గుండెపోటుకు దారితీస్తాయి అని డాక్టర్లు చెపుతున్నారు. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే వారట శ్రీదేవి. యాభై ఏళ్లు దాటినా చలాకీగా, చురుగ్గా, ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో కనిపించారంటే కారణం తన ఆహారపు అలవాట్లే. శ్రీదేవి పూర్తిగా శాకాహారి.

చిరుతిళ్లకి దూరం. కనీసం శీతల పానీయాలు కూడా తాగేవారు కాదట. రోజూ వ్యాయామం తప్పనిసరి, కనీసం రెండుగంటలైనా వ్యాయామం, యోగ చేసేవారట. కుమార్తెలతో కలసి ఆటాపాటల్లో మునిగితేలే వారని, ముఖ్యంగా అదే తనని ఉత్తేజపరిచే వ్యాపకం. శ్రీదేవికి వంట రాదని, కాకపోతే ఈ కూర ఇలా వండితే బాగుండు, అందులో ఇంకొంచెం కారం వేస్తే బాగుండు లాంటి సలహాలు మాత్రం ఇచ్చేవారని తెలుస్తోంది. మరి అలాంటపుడు ఆమెకి సడెన్ గా కార్డియాక్ అరెస్ట్ ఎలా అయిందనేది అంతుచిక్కని వాదన.

నేను కావాలనుకుంటే చిటికెలో సన్నబడి పోగలను అని శ్రీదేవి ఎప్పుడూ సన్నిహితులతో చెప్తుండేవారని తెలుస్తోంది. కాస్త లావయినట్లు అనిపించినా, వెంటనే సులువుగా తగ్గిపోగల శరీర తత్వం తనదని శ్రీదేవి ఒకానొక సందర్భంలో చెప్పారు. మిఠాయిలన్నా, ఐస్‌క్రీములన్నా, చెప్పలేనంత ఇష్టం. ఎడాపెడా లాగించేస్తాను. అయితే, ఆ తర్వాత నా ముఖం కావలసిన దానికంటే ఎక్కువ గుండ్రంగా తయారైందనిపించినపుడు చటుక్కున జాగ్రత్త పడతా. కేవలం ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను.

అంతే కేవలం నాలుగురోజుల్లో చక్కగా సన్నబడిపోతాననేవారు. సౌందర్యం కోసం తీరైన నాసిక కోసం శ్రీదేవి, అంచనాలను చేరుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారని, ప్రేక్షకుల్ని అలరించి, మార్కెట్లో తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకునేందుకు ఇలాంటి పాట్లు పదేవారని ఒక వాదన వుంది. అంతేకాక అమాంతం బరువు తగ్గిపోవడం సన్నగా నాజూగ్గా కనబడడం కోసం ఆమె తపించేవారట. అయితే అనవసరంగా చికిత్సలు చేయించుకోవడం వల్ల వారి ప్రాణాలకే ప్రమాదం తలెత్తుతున్న సందర్భాలూ ఉంటున్నాయి.

కరిష్మా కపూర్‌, కంగనా రనౌత్‌, ప్రియాంక ఛోప్రా, శిల్పాశెట్టి, శ్రుతి హాసన్‌ తదితరులు సౌందర్యపరమైన శస్త్రచికిత్సలు చేసుకున్నారంటూ ఆ చికిత్సకు ముందు, తర్వాత వారు కనిపించిన తీరును సామాజిక మాధ్యమాల్లో అనేకమంది పంచుకున్నారు కూడా. అగ్రగామి మైఖేల్‌ జాక్సన్‌ సౌందర్యపరమైన చికిత్సలనేసరికి చప్పున గుర్తుకువచ్చే పేరు పాప్‌ ధ్రువతార మైఖేల్‌ జాక్సన్‌. ముక్కు, బుగ్గలు, గడ్డం, దవడ తదితర భాగాలకు ఆయన అనేకమార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అప్పుడే అందుబాటులోకి వస్తున్న, ప్రమాదకరమైన చికిత్సలనూ ఆయన ఎంచుకోవడం విశేషం. శ్రీదేవి మరణానికి, సౌందర్య చికిత్సలకు సంబంధం ఉన్నాలేకపోయినా ఈసమయం లో మాత్రం ఈ విషయమై దేశమంతటా చర్చ మళ్లీ మొదలయినట్లయింది…