ఆ హీరోగారి కూతురు .. డేటింగ్ లో ఉందట !!

Wednesday, November 23rd, 2016, 11:38:20 AM IST

sonam
బాలీవుడ్లో ప్రేమాయణాలు .. డేటింగ్ లు సర్వ సాధారణం అయిపోయాయి? ఇప్పటికే పలువురు ఈ విషయంలో సంచలనం రేపుతున్నారు. నచ్చినోడితో .. డేటింగ్ చేస్తూ .. ఆబ్బె .. మాకేం తెలియదు అంటూ బుకాయించడం కూడా మాములే !! ఇక లెటస్ట్ గా మరో గ్లామర్ భామ కూడా డేటింగ్ చేస్తూ అడ్డంగా బుక్కయింది? ఇంతకి ఆమె ఎవరో తెలుసా .. సోనమ్ కపూర్? అనిల్ కపూర్ కూతురిగా సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఎన్ని సినిమాలు చేసిన పెద్దగా కమర్షియల్ విజయాలైతే దక్కడం లేదు.. దాంతో సినిమాలు చేస్తూనే .. ఖాళి సమయంలో ప్రేమాయణం సాగిస్తుంది. ఇప్పటికే బిజినెస్ టైకూన్ ఆనంద్ అహుజా తో గత కొన్ని రోజులుగా ఘాటు ప్రేమాయణం సాగిస్తుందట, ఈ విషయం లేటెస్ట్ గా బయట పడడం .. ఆబ్బె అలాంటిది ఎం లేదని బుకాయిస్తుందట !! మొత్తానికి ఇన్నాళ్లకు సోనమ్ గాడిలో పడిందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు !!