ఫ్లాపుల్లో ఉన్నా సింగం సింగ‌మే!

Monday, July 23rd, 2018, 12:00:49 PM IST

సూర్య అన‌గానే బంప‌ర్‌హిట్.. రికార్డ్ హిట్.. సెన్సేష‌న‌ల్ హిట్ అన్న మాట త‌ప్ప వేరొక మాటే ఉండేది కాదు. అలాంటిది ఏమైందో గ‌త కొంత‌కాలంగా త‌డ‌బ‌డుతున్నాడు. గ‌జిని, సింగం సిరీస్ మ్యాజిక్‌ని అత‌డు రిపీట్ చేయ‌లేక‌పోతున్నాడు. రీసెంటుగానే రిలీజైన గ్యాంగ్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. ఆ క్ర‌మంలోనే ఎన్‌జీకే అంటూ ఏదో కొత్త‌ ప్ర‌య‌త్న‌మే చేస్తున్నాడు. చాలాకాలంగా ఫ్లాపుల్లో ఉన్న సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తుండ‌డంతో ఈ ఎటెంప్ట్ ఆ ఇద్ద‌రికీ కీల‌క‌మేన‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇక‌పోతే ఎన్ని ఫ్లాపుల్లో ఉన్నా సింగం సింగ‌మే! అత‌డు నంద‌గోపాల కృష్ణ (ఎన్జీకే)గా కొత్త గెట‌ప్‌తో వ‌స్తున్నాడు అన‌గానే అభిమానుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. చెగువేరాను త‌ల‌పించే విప్ల‌వ నాయ‌కుడిగా తొలి పోస్ట‌ర్‌లో క‌నిపించిన సూర్య రెండో పోస్ట‌ర్‌లో గుబురు గ‌డ్డంతో ర‌ఫ్ స్టూడెంట్ లుక్‌లో కాల‌రెగ‌రేస్తూ క‌నిపించాడు. ఈ లుక్ ఫ్యాన్స్‌లో జీవం నింపింది. ఇక‌పోతే ఎన్‌జీకేతో త‌ప్ప‌నిస‌రిగా అత‌డు బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన స‌న్నివేశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. అస‌లింత‌కీ అంత‌టి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని సెల్వ తెర‌కెక్కిస్తున్నాడా? లేక గ‌త త‌ప్పిదాల్ని రిపీట్ చేస్తున్నాడా? అన్న‌ది కాస్త వేచి చూడాలి. ఎన్‌జీకే దీపావ‌ళి కానుక‌గా తెలుగు, త‌మిళ్‌లో భారీగా రిలీజ్ కానుంది. నేడు సూర్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్జీకే సెకండ్ లుక్‌ని లాంచ్ చేశారు. ఈలుక్‌కి స్పంద‌న బావుంది.

  •  
  •  
  •  
  •  

Comments