రాజమౌళి పై వున్న ఆ సెంటిమెంట్ కి తెర పడ్డట్లేనా ? Wednesday, January 31st, 2018, 02:15:42 PM IST

అపజయమెరుగని దర్శక ధీరుడు రాజమౌళి చిత్రాలు కానీ ఆయన చిత్రాల్లో నటించిన హీరోలు, నటీనటులు, వారికి వచ్చే అద్భుత ఇమేజ్ కారణంగా తదుపరి అవకాశాలు వెల్లువలా వచ్చినా, తరువాత వారు చేసే చిత్రాలు మాత్రం ప్లాప్ లను చవిచూస్తున్నాయని అంటున్నారు. సింహాద్రి వంటి భారీ విజయం తర్వాత యన్ టి ఆర్ కు చాలా రోజులదాకా సక్సెస్ రాలేదు, తరువాత చివరికి రాజమౌళినే యమదొంగ తో మంచి హిట్ ఇవ్వవలసి వచ్చింది. అదే రీతిన హీరో నితిన్ కి కూడా సై తర్వాత నుండి ఇష్క్ వరకు హిట్ లేదు, రవితేజ కు విక్రమార్కుడు తర్వాత ఖతర్నాక్ ప్లాప్ అయింది, సునీల్ తరువాతి చిత్రం పూలరంగడు బానే ఆడినా ఆ పై వరుసగా ప్లాప్ ల బాట పట్టవలసి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విధమైయినా సెంటిమెంట్ కి ఇంక బ్రేక్ పడినట్లే అని అంటున్నారు. అత్యద్భుత చిత్రం బాహుబలి లో హీరోయిన్ పాత్రలో నటించిన అనుష్క తదుపరి చిత్రం భాగమతి మంచి విజయాన్ని అందుకుందని, అలానే బాహుబలి తర్వాత రానా ప్రధాన పాత్రలో చేసిన నేనే రాజు నేనే మంత్రి తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇక మిగిలింది ప్రభాస్ అని, తన తదుపరి చిత్రం సాహూ కూడా హిట్ అయితే ఇంక ఈ దెబ్బతో రాజమౌళి పేరిట వున్న ఆ ప్లాప్ సెంటిమెంట్ పోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి….