నిర్మాతలకు చుక్కలు చూపెడుతున్న ఆ హీరోయిన్ ??

Saturday, March 24th, 2018, 04:23:54 PM IST


కొందరు హీరోయిన్ లు ఒకటి రెండు సక్సెస్ లు రాగానే అమాంతం తమ రెమ్యూనరేషన్ పెంచేస్తుంటారని టాలీవుడ్ లో ఓ టాక్ వుంది. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో మంచి సినిమాలు చేస్తూ పైకి వస్తున్న ఒక హీరోయిన్ అమాంతం తన రెమ్యూనిరేషన్ పెంచేసి, అలానే తన వద్దకు వచ్చిన నిర్మాతలకు షరతులు విధిస్తోందనే ఒక వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, ఇటీవల నాగశౌర్య హీరోగా నర్తనశాల సినిమాను ప్లాన్ చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌ ను చిత్ర బృందం సంప్రదించగా, ఈ ముద్దుగమ్మ నిర్మాతల ముందు వివిధ డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. ఊహించని భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన మెహ్రీన్, చేతి ఖర్చుల కోసం రోజూ కొంత మొత్తం ఇవ్వాలని షరతులు పెట్టిందట. దీంతో ఆమెను ఈ సినిమాలో తీసుకోవాలా లేక ఇంకో నటిని సంప్రదించాలా అనే విషయంలో నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 12న సెట్స్‌ పైకి రానున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంది…..