భరత్ అనే నేను విషయం లో ఆ సెంటిమెంట్ నిజం కానుందా?

Wednesday, January 10th, 2018, 03:30:22 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య సెంటిమెంట్ల ట్రెండ్ ఒకటి నడుస్తుంది. ఒక హీరో సినిమా హిట్ అయితే ఫలానా సెంటిమెంట్ వల్ల హిట్ అయిందని, అదే ప్లాప్ అయితే ఇంకేదో సెంటిమెంట్ వల్ల ప్లాప్ అయిందని నమ్మే వారు ఎక్కువయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న నూతన చిత్రం భరత్ అనే నేను (వర్కింగ్ టైటిల్). అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ ఒకటి జరుగుతోంది. అది ఏంటంటే మహేష్ బాబు తో మొదటిసారి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరైనా, రెండవసారి ఆయనతో జత కడితే నూటికి తొంబై శాతం ప్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వున్నాయి అంటున్నారు. అది మహేష్ బాబు గత చిత్రాల గ్రాఫ్ ఒకసారి పరిశీలిస్తే అర్ధం అవుతుంది. ఆయనతో ఒక్కడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గుణశేఖర్ తరువాతి అర్జున్, యావరేజి చిత్రం గాను, సైనికుడు ప్లాప్ గాను నిలిచాయి. అతడు వంటి సూపర్ హిట్ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా ప్లాప్ అయిన విషయం తెలిసిందే. దూకుడు వంటి అల్ టైం సూపర్ హిట్ ఇచ్చిన శ్రీను వైట్ల తో తరువాత చేసిన ఆగడు ఘోర పరాజయాన్ని చవి చూసింది. అదే పంధా లో సీతమ్మ వాకిట్లో వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో ప్లాప్ ఇచ్చారు. అదే విధంగా శ్రీమంతుడు తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల తదుపరి చిత్రం భరత్ అనే నేను కూడా ప్లాప్ అని కొందరి అబిప్రాయం. అయితే ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే ప్రిన్స్ మహేష్ ని సూపర్ స్టార్ మహేష్ ని చేసిన పోకిరి వంటి అల్ టైం బ్లాక్ బస్టర్ అందించిన పూరి జగన్నాథ్ తో ఆయన చేసిన బిజినెస్ మాన్ మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఏది ఏమైనా భరత్ అనే నేను కు ప్లాప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ వున్నాయి అనే వారు ఉన్నప్పటికీ ఆ చిత్రం విడుదల అయితేనే కానీ ఏ సెంటిమెంట్ నిజం అవుతుందో చెప్పలేం..