జనసేనపార్టీ అధినేత పై విమర్శలు సరైనవేనా?

Wednesday, October 16th, 2019, 11:58:13 AM IST

పవన్ కళ్యాణ్ ఏ పని చేస్తున్నా దానికి ప్రశంసలు, విమర్శలు మెండుగా వస్తున్నాయి. నిన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రారంభించిన రైతు భరోసా పథకం పై పవన్ కళ్యాణ్ విమర్శలు చేసారు. ఎన్నికల ముందు జగన్ ఏటా రైతుకు 12,500 రూపాయలు ఇస్తానని, రైతు భరోసానే, రాష్ట్రానికి భరోసా అంటూ మాటలు చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే కేంద్ర నిధుల్ని జత చేసి రైతు భరోసా-పీఎం కిసాన్ అని తెలివిగా వెయ్యి రూపాయలు పెంచి 13,500 రూపాయల్ని 50 లక్షల రైతులకు అందజేయనున్నారు. ఇదే విషయం పై పవన్ విమర్శలు గుప్పించారు. లెక్కలు అడిగారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఆర్థిక సహాయం ఆరు వేల రూపాయలు. జగన్ అందిస్తానన్న సహాయం 12,500 రూపాయలు. మొత్తం కలిపి 18,500 రూపాయలు. ఇలా పవన్ ప్రశ్నించినందుకు గాను, జగన్ అభిమానులు, పవన్ పై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, ఇపుడు సహాయం చేయడమే ఎక్కువ అన్నట్లుగా వారి విమర్శలు వింటున్నాం. హామీలను నెరవేర్చలేకే చంద్రబాబు ని తప్పించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టి గెలిచి ఇలా చేస్తుంటే ప్రజలు మరొక ప్రత్యామ్నాయం వైపు చూస్తారనడం లో సందేహం లేదు. ప్రశ్నించినందుకు పవన్ పై ఇలా విమర్శలు రావడం పట్ల జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.