ప్రజావేదిక కేటాయింపు ఎవరికీ దక్కనుంది…?

Thursday, June 6th, 2019, 03:38:15 AM IST

వైసీపీ పార్టీ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ని ఒక కొత్త కోరిక కోరింది. పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేందుకు ప్రజావేదికను తమకే కేటాయించాలని ఏపీ సీఎస్‌ ఎల్వీసుబ్రమణ్యంను వైకాపా కోరింది.అయితే ఇదే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ముందుగానే తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ప్రతిపక్ష నేతకే ప్రజావేదికను కేటాయించాలని చంద్రబాబు లేఖలో కోరడం విశేషం. తన నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను తెదేపా అధికారిక కార్యకలాపాల కోసం కేటాయించాలని పేర్కొన్నారు. అయితే ప్రజాభిప్రాయం మేరకు పార్టీ ప్రభుత్వం మధ్యన సత్సంభంతో పలు కార్యక్రమాలను జరపడానికి ఈ వేదిక అనువుగా ఉంటుందని తలశిల రఘురాం పేర్కొన్నారు. కాగా ఏ ప్రజావేదికలో నిర్వహించే సమావేశాలకు వైకాపా అధ్యక్షుని హోదాలో మాత్రమే సీఎం జగన్‌ హాజరవుతారని, సీఎం భద్రత, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రజావేదిక అనువుగా ఉంటుందని రఘురాం పేర్కొన్నారు. అయితే సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజావేదికను తమ పార్టీకి కేటాయించాలని వైసీపీ సీఎస్‌కు కోరినట్లు సమాచారం. అయితే ఏపీలో ఇపుడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ లు ఇరువురు కూడా ప్రజావేదిక తామే కేటాయించాలని కోరడంతో, ఎవరికీ కేటాయిస్తారా అని ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధార పది ఉంది.