ఆలోచింపదగ్గ మ్యాటర్ – ఈ లెక్కన టీడీపీ,వైసీపీ మధ్యన చీకటి ఒప్పందం ఉందా..?

Wednesday, September 18th, 2019, 01:42:59 PM IST

ఇప్పటి వరకు గడిచిన అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఏపీ రాజకీయాలను గమనిస్తే ఒక్క విషయం మాత్రం చాలా సుస్పష్టంగా తేటతెల్లం అవుతుంది.అదేమిటంటే అక్కడ రాజకీయాలు చేస్తే కేవలం రెండు పార్టీలు మాత్రమే చెయ్యాలి,గెలుపైనా ఓటమి అయినా సరే ఆ రెండు పార్టీల మధ్యనే ఉండాలి అన్నట్టుగా కాలం మారుతూ వస్తుంది.అయితే రాజకీయం అంటే ప్రజాసేవ అనే మాటను మర్చిపోయి ఎవరు అధికారంలో ఉంటారో వారికి వారితో చేతులు కలిపిన వారికి అపారమైన లాభాన్ని చేకూర్చే మహా వ్యాపారంలా మార్చెసారు మన రాజకీయ నాయకులు.

ఓటుకు నోటు ఇస్తారు,మద్యం పోస్తారు మళ్ళీ అదే నోటితో అవినీతి లేకుండా చేస్తాం మద్యం లేకుండా చేస్తాం అని వారే స్టేట్మెంట్స్ ఇస్తారు.అదేంటో కానీ అయినా సరే వారికే అధికారాన్ని కట్టబెట్టి ప్రజలు కూడా చేతులు దులుపుకుంటారు.ఇది ఇలా అలవాటు అయ్యిపోయింది సారి అలా చేసేసారు.ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ వీటన్నిటికీ అతీతంగా ఎవరైనా రాజకీయాలు చెయ్యడానికి వస్తే మాత్రం ఈ ప్రముఖ రెండు పార్టీలు కాస్తా ఏకమయ్యిపోయి ఉంటే వారే ఉండాలి.

కానీ మూడో వ్యక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారి దారికి అడ్డం రాకూడదని అనుకుంటారని ఇప్పుడు ఏపీలో జరుగుతున్న సంఘటనలను చూసి అక్కడ రాజకీయాల్లోకి మూడో ప్రత్నామ్యాయంగా వచ్చి ఘోరమైన వైఫల్యాన్ని చూసిన జనసేన పార్టీ శ్రేణులు అంటున్నారు.తమ ఒక్క పార్టీ విషయంలో మాత్రం టీడీపీ మరియు వైసీపీలు ఏమన్నా చీకటి ఒప్పందాలు చేసుకున్నాయా అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు.

టీడీపీ మరియు వైసీపీ పార్టీలతో చూసుకున్నట్టయితే జనసేన పార్టీకు అంత బలమైన మీడియా సపోర్ట్ లేదు.దానితో వారి గళాన్ని కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వినిపిస్తున్నారు.వారు చెప్పేది అయినా సరే రెండు పార్టీలకు దిమ్మతిరిగిపోయేలా సూటిగా ఎలాంటి బూతులు కానీ వ్యక్తిగత ఆరోపణలు కానీ చెయ్యకుండా విమర్శలు చేస్తారు.కానీ ఒక్కసారిగా అలాంటి ట్విట్టర్ హ్యాండిల్స్ అన్నీ నిన్న ట్విట్టర్ నుంచి సస్పెండ్ కాబడ్డాయి.దీనితో ఒక్కసారిగా జనసేన శ్రేణులకు కాసేపు ఏమీ అర్ధం కాలేదు.

దాదాపు 300 కి పైగా ప్రముఖ జనసేన సోషల్ మీడియా అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి,దీనితో మిగతా వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.కేవలం జనసేన అకౌంట్లు మాత్రమే ఇలా జరగడం ఒక్కసారిగా అనేక అనుమానాలకు దారి తీసింది.మాములుగా అయితే వైసీపీకు ప్రధాన ప్రతిపక్షం మరియు వారి చిరకాల రాజకీయ శత్రువు ముమ్మాటికీ తెలుగుదేశం పార్టీయే..అసలు జనసేన పార్టీను వారు లెక్కలోకి కూడా తీసుకోము అంటారు.అంతే కాకుండా ఏ ఈ రెండు పార్టీల సోషల్ మీడియా హ్యాండిల్స్ కన్నా జనసేన సోషల్ మీడియా విభాగం వారే చాలా హుందాగా విమర్శలు చేస్తారు.

అలా చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకు చెందిన ట్విట్టర్ హ్యాండిల్స్ కానీ వారి అభిమానులవి కానీ ఏ ఒక్కటీ ట్విట్టర్ నుంచి సస్పెండ్ కాలేదు.కానీ జనసేనవి మాత్రమే అయ్యాయి అంటే ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగి ఉండొచ్చు.అలాగే తెలుగుదేశం పార్టీవి మాత్రమే వదిలేసారు అంటే ఇక్కడ టీడీపీ కు మరియు వైసీపీకు ఏమన్నా చీకటి ఒప్పందం ఉందా ఇది వరకు రాజకీయంగా వచ్చిన చిరంజీవిని ఎలా తొక్కేశారో ఇప్పుడు జనసేనను మరియు పవన్ కళ్యాణ్ ను తొక్కే ప్రయత్నం లోని భాగమేనా ఇది కూడా అని ప్రశ్నిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీవి ఎందుకు సస్పెండ్ అవ్వలేదు జనసేనవి మాత్రమే ఎందుకు సస్పెండ్ అయ్యాయి అన్నదానికి మాత్రం ఎలా చూసిన వైసీపీ వైపే అనుమానాలు కనిపిస్తున్నాయి.ఈ విషయంలో మాత్రం ఏదో మూలాన టీడీపీ వైసీపీ కలిసే ఉన్నాయా అన్న అనుమానం ఈ ఇష్యూ తెలిసిన ప్రతీ ఒక్కరికి కలుగక మానదు.కేవలం జనసేనను మాత్రమే ఇంతలా ఎందుకు టార్గెట్ చేస్తున్నారో వారికే తెలియాలి.