తెలంగాణాలో బీజేపీ టార్గెట్ ఇదేనా…?

Friday, June 14th, 2019, 11:10:00 PM IST

తెలంగాణాలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లో లోక్ సభ స్థానాన్ని మొదటిసారిగా దక్కించుకున్నటువంటి బీజేపీ, నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. అంతకుముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో డిపాజిట్లు కూడా దక్కించుకొని బీజేపీ పార్టీ లోక్ సభ స్థానాన్ని దక్కించుకునేంతల బలాన్ని సమకూర్చుకుంది. అంతేకాకుండా మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతున్నారు. అయితే బీజేపీ బలం చేకూర్చుకొవాలని ప్రయత్నించినప్పటికీ కూడా అసెంబ్లీ ఎన్నికలతో పాటే పంచాయితీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ చతికిలపడిపోయింది. కానీ ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ నిజామాబాద్ జిల్లాలో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

కాగా బీజేపీ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ కి వెళ్లిన ఎంపీ అరవింద్ కూడా అక్కడ ప్రముఖులతో ఇదే విషయాన్నీ చర్చించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుతానికి బీజేపీ పై ఉన్నటువంటి ఆలోచనలను, అభిమానాన్ని అంతకు మించి పెంచుకునేలాగా, పార్టీ బలోపేతానికి అందరు కూడా సమిష్టిగా కృషి చేయాలనీ బీజేపీ కార్యకర్తలకు తెలిపారు. అంతేకాకుండా పార్టీ బలోపేతానికి ఇప్పటికిప్పుడు క్షేత్రస్థాయిలో చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనే విషయాలను వారికి వివరించినట్లు తెలిసింది. అందుకోసమనే ఇప్పటికే చర్యలు చేపట్టాలని ఎంపీ అరవింద్ అన్నారు.