అదంతా కూడా కేశినేని నాని వ్యూహమేనా…?

Wednesday, July 17th, 2019, 02:30:08 AM IST

తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని కావాలనే పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతున్నాడా…? అవుననే సమాధానమే దొరుకుతుంది ఈ విషయానికి. ఇదంతా కూడా కేశినేని నాని వ్యూహమే అని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు… ఇదంతా పక్కనబెడితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ గోరమైన పరాజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. దానికి తోడు ఇన్నిరోజులు నమ్మకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా టీడీపీ ని వదిలి వెళ్లిపోవడం అనేది చంద్రబాబు కి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఒకవైపు పార్టీ ఓటమి, మరొకవైపు వలసలు ఎక్కువగా జరగడం, మరొకవైపు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ చూసి ఏమి చేయాలో అర్థం చేసుకోలేని పరిస్థిలో కూరుకుపోయారు టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.

ఇదిలా ఉండగా విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మధ్య గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మాటల యుద్ధం, పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారనేది ఎవరికీ కూడా అర్థం కానీ విషయం అనే చెప్పాలి. కాకపోతే కేశినేని నాని సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఇలా కావాలనే పార్టీ నేతలమీద తీవ్రమైన విమర్శలు చేస్తూ అందరిని నొప్పిస్తున్నాడని సమాచారం. కాకపోతే ఈ పర్యవసానాల వలన కేశినేని నాని కూడా టీడీపీ పార్టీ వీడనున్నాడని పలు రకాల వార్తలు వస్తున్నాయి. టీడీపీ ని వదిలి బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యాడని, ఇప్పటికే పలువురు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఒకవేళ నాని కూడా టీడీపీ ని వదిలేస్తే పాపం చంద్రబాబు పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ అర్థం కానీ విషయం గా మిగిలిపోయింది.