త‌ప్పించుకోవ‌డానికే ర‌విప్ర‌కాష్ మీడియా యుద్దం!

Friday, June 7th, 2019, 08:14:29 AM IST

నెల రోజుల పాటే పోలీసుల‌కు చిక్క‌కుండా విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా త‌ప్పించుకు తిరిగిన టీవి9 మాజీ సీఈఓ ర‌విప్ర‌కాష్ ముంద‌స్తు బెయిల్ కోసం నానా తంటాలు ప‌డ్డారు. హైకోర్టు నుంచి సుప్రీమ్ కోర్టు వ‌ర‌కు పోర్లు దండాలు పెట్టారు. అయినా లాభం లేక‌పోవ‌డంతో తిరిగి సీసీఎస్ పోలీసుల ముందు మంగ‌ళ‌వారం ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పి వ‌రుస విచ‌ర‌ణ‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు కానీ నోరు విప్ప‌డం లేదు. విచార‌ణ కాలాన్ని హ‌రించి కొత్త ఎత్తు కోసం ఇలా చేస్తున్నారా?. బుధ‌వారం తెలంగాణ అమ్రీష్‌పురి మీడియాను క‌డ‌లిస్తున్నాడంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న స్వ‌రం పెంచ‌డానికి కార‌ణం ఎవ‌రు?. ఎవ‌రి అండ చూసుకుని ర‌విప్ర‌కాష్ బాహాటంగానే తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు?

అంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌టికొచ్చింది, విచార‌ణ పేరుతో కాల‌యాప‌న చేసి తిరిగి కోర్టు వెళ్లి త‌న‌కు అనుకూలంగా తీర్పుని తెచ్చుకోవాల‌న్న ప్లాన్‌లో భాగంగానే త‌ను చేసిన త‌ప్పుల కార‌ణంగానే జ‌రుగుతున్న విచార‌ణ‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌నే ఇది మీడియాపై జ‌రుగుతున్న యుద్ధం అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నార‌ని, ఈయ‌న బాగోతం తెలియ‌ని మీడియా వుందా ? అని ప‌లువురు సామాన్యులు ర‌విప్ర‌కాష్‌పై సెటైర్లు వేస్తున్నారు. మాంచి స్వింగ్‌లో వుండ‌గా తెల్ల‌గా క‌నిపించిన ప్ర‌తి ఒక్క‌రినీ బెదిరించి డ‌బ్బులు దండుకున్న‌ర‌విప్ర‌కాష్ ఇప్పుడు విడ్డూరంగా త‌న వ్య‌క్తిగత విష‌యాన్ని మీడియాకు ఆపాదించి మీడియాకు తెలంగాణ ప్ర‌భుత్వానికి జ‌రుగుతున్న యుద్ధంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం విడ్డూరంగా వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు, ప్ర‌జాస్వామ్య వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు.