మన బాహుబలికి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కి పోలికా.?

Saturday, September 29th, 2018, 12:15:56 PM IST

ఒక్క సారిగా ప్రపంచ సినిమా ప్రేక్షకులు అందరిని ఒక్క సారిగా తెలుగు చిత్ర పరిశ్రమ వైపు బాహుబలి అనే చిత్రంతో తిరిగి చూసేలా చేసాడు దర్శకుడు రాజమౌళి.అసలు వారు అనుకున్న స్థాయిని మించి ప్రకంపనలు సృష్టించింది బాహుబలి మొదటి భాగం.అంతే ఇక రెండో భాగానికి వచ్చేసరికి ఈ అంచనాలు ఇంకా తార స్థాయికి చేరిపోయాయి.రెండవ భాగం కూడా విడుదలయ్యి భారతదేశంలో ఉన్న ఈ ఒక్క రికార్డును కూడా ఉంచకుండా మన బాహుబలి వేటాడేసాడు.దీనితో బాహుబలిని స్ఫూర్తిగా తీసుకోలేదు అంటూనే తీస్కొని మొదటి భాగాన్ని కొట్టేందుకు ధీటుగా మా చిత్రాన్ని తీశామంటూ గల్లంతైన చిత్రాలు దర్శకులు కూడా లేకపోలేరు.అలాంటి చరిత్ర సృష్టించింది బాహుబలి చిత్రం.

ఇప్పుడు కూడా అదే తరహాలో మరో సినిమా వస్తుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేవు.బాలీవుడ్లో పెద్ద పెద్ద తారలు అమితాబ్,అమీర్,కత్రినా కైఫ్ ఇంకా ఎంతో మంది పెద్ద పెద్ద తారలు 1795వ సంవత్సరంలో బ్రిటీషు వారిపై తిరుగుబాటు చేసిన భారతీయుల నేపధ్యంలో విజయ్ కృష్ణ ఆచార్య దాదాపు 210 కోట్ల భారీ వ్యయంతో “థగ్స్ ఆఫ్ హిందుస్థాన్” తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్ కూడా విడుదలయ్యింది.ఇప్పుడు ఈ చిత్రానికి మన బాహుబలిని పోల్చి చూస్తున్నారు.ఈ చిత్రం బాహుబలి రికార్డులను తిరగరాయడానికే తీస్తున్నారని కూడా అర్ధమవుతుంది కానీ,ఈ చిత్రం విజువల్స్ చూసుకుంటే 210 కోట్ల బడ్జెట్ ఎక్కడ పెట్టారా అనిపిస్తుంది,బాహుబలి విజువల్స్ తో పోల్చితే కాస్త తక్కువ స్థాయిలోనే ఉన్నాయి అని చెప్పాలి.థగ్స్ ట్రైలర్ యాక్షన్ పరంగా ఆకట్టుకున్నా విజువల్స్ పరంగా బాహుబలిని మించలేదని తెలుస్తుంది.అలాంటిది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాహుబలికి పోటీ అనేది కష్టమే అని చెప్పాలి.