జగన్ విషయంలో ఉండవల్లి రాంగా..??

Wednesday, November 20th, 2019, 07:00:48 AM IST

వైసీపీ అధినేత మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ రాజకీయ వేత్త మరియు విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంత సన్నిహితులో అందరికి తెలుసు.అయితే ఈసారి ఎన్నికల తర్వాత ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులు పై ఉండవల్లి స్పందించడానికి కాస్త సమయం ఎక్కువే తీసుకున్నారు.చంద్రబాబు ప్రభుత్వం లో అయితే తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు అంటూ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉండగా ఉండవల్లి జగన్ విషయంలో స్పందిస్తూ చేస్తున్న కామెంట్స్ ను గమనుస్తున్న వారు మాత్రం జగన్ పై ప్రేమ ఎక్కడికి పోతుంది అంటున్నారు.ఈ మధ్య ఉండవల్లి జగన్ ను ఉద్దేశించి అవినీతి పై చేస్తున్న వ్యాఖ్యలు హైలైట్ అవుతున్నాయి. జగన్ పై స్థాయిలో ఉన్న అవినీతి అంతటిని నిర్మూలించేసాడని ఇది తన వరకు వచ్చిన సమాచారం అని అన్నారు.కానీ కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి మాత్రం అలాగే ఉండిపోయిందని అన్నారు.దీనితో ఉండవల్లిని పలువురు తప్పుబడుతున్నారు.అసలు జగన్ అవినీతి చెయ్యకుండా ఎలా ఉంటాడని ఇంతింత ఖర్చు పెట్టి గెలిచింది ప్రజా సేవ చెయ్యడానికా? జగన్ కు ఎలా ఏ విధంగా సంపాదించుకోవాలో అంతా తెలుసని పెద్ద వ్యాపార వేత్త అయినటువంటి జగన్ కు ఎటు నుంచి ఎలా డబ్బులు తరలించుకోవాలో తెలుసని అంటున్నారు.ఇది ఉండవల్లికి తెలీదా అంటూ జగన్ విషయంలో ఆయన్ను రాంగ్ అంటున్నారు.