చివరి సారి కెసిఆర్ కు ఓటేసిన అర్జున్ రెడ్డి..మరి ఈ సారి కూడా..?

Thursday, October 4th, 2018, 04:29:17 PM IST

విజయ్ దేవరకొండ ఈ పేరు ఇప్పుడున్న యువతలో ఒక సంచలనమే అని చెప్పాలి.ముందు సాదా సీదా చిన్న చిన్న పాత్రలు చేసుకొచ్చినా సరే హీరోగా తెరకు పరిచయం అయ్యాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఒకటి రెండు చిత్రాల మినహా మిగతా చిత్రాలు అన్ని ఒక సంచలనమే అని చెప్పాలి.తన ఆటిట్యూడ్ తో యువతలో విజయ్ తనదైన ముద్ర వేసుకున్నాడు,అర్జున్ రెడ్డి తో ఐతే మాత్రం ఇక ఒక సంచనంగా మారిపోయాడు.ఇప్పుడు తన కొత్త చిత్రం “నోటా” విడుదలవుతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రాజకీయాలు,రాజకీయ నాయకులు పట్ల కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు.

తన చిన్న వయసులో తనకి చంద్రబాబు గారి పాలన అంటే ఇస్తామని,అప్పట్లో తెలంగాణను ఇంతలా అభివృద్ధి చేసింది బాబు గారే అని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా తనకి తెలంగాణా ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని,ఆయన అందరి రాజకీయనాయకుల్లా కాదని,కొంత మంది చెప్పేవి ఆచరణలో పెట్టరని కానీ కేటీఆర్ మాత్రం అలా కాదని తనని కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి వాడొద్దని,తాను ఎలాగో ఇప్పుడు హీరో కాబట్టి వారానికి ఒక్కసారి ఐనా చేనేత వస్త్రాలు ధరించాలని కేటీఆర్ చెప్పేవారని విజయ్ చెప్పాడు.మీరు ఈ సారి ఎన్నికల్లో ఎవరికీ ఓటేస్తారు అని అడగగా చివరి ఎన్నికల్లో ఐతే కెసిఆర్ కు వేశానని,ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వారి పాలన బాగుందని,బాగా పరిపాలన సాగిస్తారని నమ్ముతున్నాని వచ్చే ఎన్నికల్లో కూడా తెరాస పార్టీకే తన ఓటు వేస్తానన్నట్టుగా సూచన ఇచ్చారు.