అర్జున్ రెడ్డి అరవిందుడి దగ్గర నిలవగలడా.?

Saturday, September 29th, 2018, 07:52:08 PM IST

సెప్టెంబరు నెల వినాయక చవితి కొన్ని సినిమాలతో ముగిసిపోయింది,అయినా సినీ ప్రేక్షకుల దాహం తీరలేదు ఏదొక పెద్ద సినిమా రావాలి.ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది దీనితో సినీ ప్రేక్షకులు కూడా ఎవరైనా పెద్ద హీరో సినిమా కోసం ఆకలిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పుడు అక్టోబరు నెలలోకి ఎలాగో అడుగు పెట్టాం దసరా మొదలవుతుంది,ఇక్కడి నుంచి అసలైన పండగ మొదలవుతుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం “అరవింద సమేత” వంటి క్రేజీ ప్రాజెక్ట్ దసరా బరిలో ఉంది అని అందరికి తెలుసు.

అంతే కాకుండా గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత విజయ్ దేవరకొండ నటించిన “నోటా”చిత్రం కూడా దసరా బరిలోనే ఉంది దీనితో మన అర్జున్ రెడ్డి మన అరవిందుడి దగ్గర పోటీలో నిలవగలడా అన్న సందేహం వస్తుంది,అసలే ఎన్టీఆర్ మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అలాగే విజయ్ కూడా యూత్ ని ఒక ఊపు ఊపేస్తున్నాడు,కానీ విజయ్ ఎంత వరకు నిలదొక్కుకోగలడు అనేది ప్రశ్న ఒకప్పుడు పెద్ద హీరోల సినిమా ఉంటే కొన్ని కుర్ర హీరోల చిత్రాలు ఆపిన సంఘటనలు ఉన్నాయి కాని ఇప్పుడు అలా కాదు,చిన్న సినిమా వాళ్ళు కంటెంట్ ని నమ్ముకొని పెద్ద హీరోలకి ధీటుగా వారి చిత్రాలను కూడా విడుదల చేస్తున్నారు.ఈ రెండు సినిమాలకి కేవలం ఐదు రోజుల తేడా మాత్రమే ఉంది ఈ సమయంలో ఏ మాత్రం ఎన్టీఆర్ కు హిట్ టాక్ వచ్చినా విజయ్ కు పెద్ద దెబ్బె తగులుతుంది,అలా అని విజయ్ ని కూడా తక్కువ అంచనా వెయ్యలేం తాను హిట్ టాక్ తెచ్చుకుంటే తన సినిమా ప్రేక్షకులని కూడా పోనివ్వడు,కానీ ఈ దసరాకి మాత్రం ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ మాత్రం అందబోతున్నాయి.