విజయసాయి రెడ్డి సెటైర్ కేసీఆర్ పైనేనా..?

Sunday, July 12th, 2020, 11:22:29 AM IST

మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల టాపిక్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిలో హోట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే గత రెండు మూడు నెలలు వెనక్కి వెళ్తే వారి దృష్టిలో హీరోగా ఉన్న సీఎం ఇప్పుడు నత్తింగ్ అయ్యారు. అప్పుడు నత్తింగ్ అనిపించుకున్న సీఎం హీరో అయ్యారు.

దీనితో ఈ ఇద్దరికీ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ ఉండాల్సిన దూరం ఉందనే చెప్పాలి. ఆ తర్వాత జగన్ మాటలు తగ్గించి పనులు చెయ్యడం మొదలు పెట్టడంతో ఏపీ ఒక్కసారిగా దేశ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ తర్వాత కేసీఆర్ ఒట్టి మాటల ముఖ్యమంత్రి మాత్రమే అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు వచ్చాయి.

ఇప్పుడు ఇదే అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అంటున్నారని చెప్పాలి. తాను పెట్టిన ఓ ట్వీట్ లో “చేతలు మాటలు కంటే ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తున్నాయి” అని హాష్ ట్యాగ్ పెట్టారు. ఇది పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించే ఉందని చెప్పాలి. మరి అది అతను కావాలనే పెట్టారో లేక మామూలుగానే పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి.