వ్యాక్స్ స్టాట్యూ.. డ‌బ్బిస్తే ఎవ‌రికైనా ఛాన్స్‌?

Thursday, July 26th, 2018, 03:30:25 PM IST

మ్యాడ‌మ్ తుస్సాడ్స్‌లో మైన‌పు విగ్ర‌హాల (వ్యాక్స్ స్టాట్యూ) హ‌డావుడి గురించి ప్ర‌పంచానికి కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన పనేలేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎంద‌రో ప్ర‌ముఖుల వ్యాక్స్ స్టాట్యూల్ని ప‌లు మ్యూజియ‌మ్‌ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టారు. లండ‌న్‌, బ్యాంకాక్‌, దిల్లీ స‌హా ప‌లు న‌గ‌రాల్లో ప్ర‌త్యేకించి మ్యాడ‌మ్ తుస్సాడ్స్ మ్యూజియ‌మ్‌ల‌ను ఏర్పాటు చేసి విగ్ర‌హాల్ని సంద‌ర్భ‌కుల కోసం డిస్‌ప్లేకు పెడుతున్నారు. ఇదో పెద్ద వ్యాపారంగా ర‌న్ అవుతోంది. అయితే మ్యాడ‌మ్ తుస్సాడ్స్‌లో ఎవ‌రిదైనా విగ్ర‌హం పెట్టాలంటే ఏఏ ప్ర‌మాణాలు కావాలి? అన్న‌దానిపై ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే అమితాబ్‌, స‌ల్మాన్‌, అక్ష‌య్‌, స‌చిన్‌, ప్ర‌భాస్ వంటి స్టార్ల మైన‌పు ప్ర‌తిమ‌ల్ని మ్యాడ‌మ్ తుస్సాడ్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఇటీవ‌లే వ‌రుణ్‌ధావ‌న్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ప్ర‌స్తుతం దీపిక ప‌దుకొనే విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. దిల్లీ, లండ‌న్‌లోని మ్యూజియ‌మ్‌ల‌లో దీపిక విగ్ర‌హాల్ని ఆవిష్క‌రిస్తార‌ట‌. మ‌రోవైపు బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ విగ్ర‌హాన్ని మ్యాడ‌మ్ తుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించేందుకు కొల‌త‌లు తీసుకున్నారు. అయితే వీళ్లంతా అక్క‌డ కొలువు దీరేందుకు అర్హులే. అయితే ఇంతటి అర్హ‌త‌లు లేక‌పోయినా కొంద‌రు మ్యానిప్యులేట్ చేసి, డ‌బ్బు చెల్లించి తుస్సాడ్స్ నిర్వాహ‌కుల్ని మ‌భ్య‌పెట్టి త‌మ విగ్ర‌హాల్ని ఏర్పాటు చేయించుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై డీప్‌గా మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉందింకా.

  •  
  •  
  •  
  •  

Comments