బ్రేకింగ్‌ : డ్రీమ్‌గాళ్‌ అమ్మ‌మ్మ అయ్యిందోచ్‌!

Monday, October 23rd, 2017, 09:27:53 AM IST

డ్రీమ్‌గాళ్ హేమ‌మాలిని అమ్మ‌మ్మ అయ్యింది. డాట‌ర్ ఇషా డియోల్ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ధ‌ర్మేంద్ర-హేమ‌మాలిని గారాల మ‌న‌వ‌రాలు మురిపాల ముసిముసి న‌వ్వుల‌కు ఇక ఫిదా అవ్వాల్సిందే. సాక్షాత్తూ లక్ష్మీదేవి డ్రీమ్‌గాళ్ ఇంటికి న‌డిచొచ్చింద‌నే చెప్పాలి. ఇషాడియోల్ ముంబై హిందూజా ఆస్ప‌త్రిలో నిన్న‌టి రాత్రి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. నేడు ఆస్ప‌త్రినుంచి డిశ్చార్జ్ అయ్యి సొంతింటికి వెళ్లిపోతున్నారుట‌. 2012 జూన్ 29న చిన్ననాటి స్నేహితుడు భ‌ర‌త్ త‌క్తానీని వివాహం చేసుకున్న ఇషా ఆద‌ర్శ‌దాంప‌త్యంతో ఆక‌ట్టుకుంటోంది. స్కూల్ స్నేహం పెళ్లివ‌ర‌కూ, అటుపై ఇలా ఆనంద‌దాయ‌కం అయ్యింద‌నే చెప్పాలి.

ఈ ఆనంద స‌మ‌యంలో ఇషాడియోల్ ఫ్యామిలీ సంబ‌రాలు చేసుకుంటోంది. ముఖ్యంగా డ్రీమ్‌గాళ్ ఆనందానికి అవ‌ధులే లేవ‌ని చెబుతున్నారు. ఇక ముంబైకి కొత్త క‌ళ వ‌చ్చిన‌ట్టే. ఇక మ‌న‌వ‌రాలితో నిరంత‌రం దాగుడు మూత‌ల దండాకోర్‌ ఆట‌లాడుకుంటూ స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తార‌న్న‌మాట‌!

  •  
  •  
  •  
  •  

Comments