స్వర్గానికి వెళ్ళచ్చు అని 80 మందిని చంపేసాడు

Sunday, November 27th, 2016, 12:48:18 PM IST

isis
అబ్బాస్ సబానీ ఇరవై నాలుగు సంవత్సరాల ఈ కుర్రాడు చూడ్డానికి అమాయకంగా ఉంటాడు. ఇస్లామిక్ స్టేట్ అతన్ని ఉగ్రవాదిగా మార్చేసింది. కిరుక్కు మీద ఇస్లామిక్ స్టేట్ చేసే దాడులలో ఇతన్ని మానవ బాంబుగా పరిగణించారు. అతను కూడా సొంతవారు అని కూడా చూడకుండా తన సొంత కుర్షీద్ వర్గం లో ఎనభై మందిని చంపేసాడు. సబీన్ కూడా తాను చేసిన నేరాన్ని ఒప్పుకుంటున్నాడు . కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశా అన్నాడు. తన కుటుంబం చాలా పేద కుటుంబం అనీ డబ్బు వస్తే చాలు అనుకున్నా అంటున్నాడు. తాను మరణిస్తే, కుటుంబ సభ్యులకు పూర్తి అండగా ఉంటామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చెప్పారని, ఆత్మాహుతి దాడి చేసి మరణిస్తే, స్వర్గానికి వెళ్లవచ్చని చెప్పారని, అయితే, తాను భయంతో మెషిన్ గన్ తో కాల్పులకు దిగానని అన్నాడు. తనతో పాటు ఎంతో మంది బాంబులున్న జాకెట్లు ధరించి దాడులకు పాల్పడ్డారని, వీరంతా మరణించారని చెప్పాడు. ఇప్పుడు సబానీని ప్రాణాలతో బంధించిన కుర్దిష్ సైన్యం, అతన్ని చట్టం ముందు నిలిపింది.