కొత్త సంవత్సరం ఉగ్ర దాడులతో మొదలవబోతుందా…?

Saturday, December 31st, 2016, 02:00:35 PM IST

terrorest
నూతన సంవత్సర వేడుకులకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. అందరూ సంబరాలు చేసుకోవడానికి సిద్ధమౌతున్నారు. ఇలాంటి సమయంలో ఇజ్రాయిల్ చేసిన ఒక ప్రకటన దేశప్రజల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. నూతన సంవత్సరం సందర్భంగా భారత దేశంలో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని ఇజ్రాయిల్ యాంటీ టెర్రరిజం డైరెక్టరేట్ హెచ్చరికలు జరీ చేసింది. ముఖ్యంగా భారత దేశంలోని నైరుతి ప్రాంతంలో ఈ ఉగ్ర ముప్పు ఎక్కువగా ఉండొచ్చని చెప్పింది. బీచ్ లు, క్లబ్బుల్లో జరిగే వేడుకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగొచ్చని పేర్కొంది.

దేశంలోని నైరుతి ప్రాంతంలో గోవా, పూణే, ముంబై, కొచ్చి ప్రాంతాలలో జరిగే నూతన సంవత్సర వేడుకులకు చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. రద్దీ ప్రాంతాలు, బీచ్ లలో జరిగే కార్యక్రమాలకు హాజరు కాకపోవడమే మంచిదని ఇజ్రాయిల్ సూచించింది. ఇజ్రాయిల్ చేసిన హెచ్చరికను న్యూ ఢిల్లీ లోని ఆ దేశ రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. ఇజ్రాయిల్ కు చెందిన పౌరులు ప్రతి ఏటా 20 వేల మంది భారత్ కు వస్తూ ఉంటారు. ఇజ్రాయిల్ పౌరులే లక్ష్యంగా 2012 లో తీవ్రవాదులు జరిపిన బాంబ్ దాడుల్లో ఇజ్రాయిల్ అధికారి భార్యతో పాటు ఆమె డ్రైవర్ మరొక ఇద్దరూ గాయపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments