జూప‌ల్లి ఇంటిపై ఐటీ సోదాల్లో ఏం తేలింది?

Tuesday, July 9th, 2019, 09:36:56 AM IST

కొన్ని రోజుల క్రితం మైహోమ్ సంస్థ‌ల అధినేత జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావు ఇంట్లో, ఆయ‌న‌కు సంబంధించిన మైహోమ్ ఆఫీసుల్లో ఐటీ దాడులు జ‌రిగాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రికి అత్యంత స‌న్నిహితుడైన జూప‌ల్లి సంస్థ‌ల‌పై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం ఏంట‌ని అంతా ఆశ్చర్యాన్ని వ్య‌క్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఐటీ అధికారుల‌కు జూప‌ల్లి ఇంట్లో ఎలాంటి ప‌త్రాలు ల‌భించాయి?. ఆ ప‌త్రాల్లో ఏముంది? అన్న విష‌యాలు మాత్రం బ‌య‌టికి రాలేదు. ఏ మీడియా సంస్థ దానిపై క‌థ‌నాలు ప్ర‌చురించ‌లేదు. ఎందుకు? తెర వెనుక ఏం జ‌రిగింది?. ఉన్న ఫ‌లంగా జూప‌ల్లి సంస్థ‌ల‌పై ఐటీ సోదాలు ఎందుకు జ‌రిగాయి? ఆ స‌మాచారాన్ని ఎవ‌రు తొక్కి పెట్టారు? అన్న‌ది మాత్రం స‌స్పెన్స్ గానే మిగిలిపోయింది.

అయితే ఈ ఉదంతంపై సోష‌ల్ మీడియాలో మాత్రం ఓ షాకింగ్ న్యూస్ జోరుగా వైర‌ల్ అవుతోంది. ఐటీ శాఖ జ‌రిపిన సోదాల్లో ప‌లు విలువైన ప‌త్రాలు ల‌భించాయ‌ని, 200 కోట్ల డ‌బ్బు కూడా దొరికింద‌ని అయితే ఈ డ‌బ్బులో స‌గం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌దేన‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికితోడు తెరాస పార్టీకి సంబంధించిన పెద్ద మొత్తం జూప‌ల్లి వ్యాపారాల్లో పెట్టుబ‌డి రూపంలో న‌డుస్తోంద‌ని, దీనికి ఎలాంటి లెక్క‌లు లేవ‌ని తెలిసి అధికారులు అవాక్క‌య్యార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన టివి9 పెట్టుబ‌డుల్లోనూ క‌విత వాటా వుంద‌ని తెలుస్తోంది. ఇన్ని ఆధారాలు దొరికినా సోదాలు నిర్వ‌మించిన అధికారులు మీడియాకు ఎందుకు చెప్ప‌డం లేదు?. ఈ విష‌యం బ‌య‌టికి పొక్కినా ఏ మీడియా ప్ర‌త్యేక క‌థ‌నాల్ని ప్ర‌చురించ‌డం లేదు? అంటే పెద్ద త‌ల‌కాయ మ్యానేజ్ చేయ‌డం వ‌ల్లే మీడియా సంస్థ‌లు నోరు మెద‌ప‌డం లేద‌ని వినిపిస్తోంది.