కాలేజ్‌లో 43కోట్లు.. ఎంపీ అక్ర‌మ సొమ్ములు!

Thursday, September 29th, 2016, 09:29:43 AM IST

money
దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన వార్త ఇది. ఒక విద్యాల‌యంలో ఏకంగా 43 కోట్ల క‌రెన్సీ క‌ట్ట‌ల్ని ఐటీ అధికారులు ప‌ట్టేశారు. దేశంలో ఇది టాప్ -2 స్కామ్. ఆదాయ‌పు ప‌న్ను చెల్లించ‌కుండా అక్ర‌మంగా దాచుకున్న దొంగ సొమ్ములివి. బెంగ‌ళూరు వైట్‌ఫీల్డ్ లోని వైదేహి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ సెంట‌ర్‌పై ఐటీ అధికారులు చేసిన దాడిలో ఈ దందా బైట‌ప‌డింది. ఈ కాలేజ్ మాజీ ఎంపీ ఆదికేశ‌వులు కుమార్తె నిర్వ‌హ‌ణ‌లో న‌డుస్తున్న కాలేజ్‌. అన్నీ 500 , 1000 నోట్ల క‌ట్ట‌లే. వీటిని ఏకంగా ఓ ఆటోలో ఏసుకుని వెళ్లాల్సొచ్చిందిట‌.

ఇదివ‌ర‌కే పుదుచ్చేరిలో ఇదే త‌ర‌హాలో మెరుపుదాడుల్లో ఓ ప్ర‌యివేటు కాలేజ్‌లో ఏకంగా రూ.82 కోట్లు ఐటీకి దొరికిపోయింది. ఇప్పుడు ఇది రెండో అతిపెద్ద దందాగా ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారులు చెబుతున్నారు. వార్నాయ‌నో మెడిక‌ల్ సీట్లు అమ్మ‌కాల్లో ఏ రేంజులో సంపాదిస్తున్నారో.. దేవుడ‌!!

  •  
  •  
  •  
  •  

Comments