రేవంత్ రెడ్డి దెబ్బ.. కేటీఆర్, హరీశ్‌రావులకు ఐటీ నోటీసులు..!

Wednesday, February 5th, 2020, 05:34:07 PM IST

తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు ఐటీ నోటీసులు జారీ చేసింది. గులాబీ కూలీ కింద మూడేళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి లెక్కలను చెప్పాలని నోటీసులలో పేర్కొంది.

అయితే గులాబీ కూలీ పేరిట టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఐటీ అధికారులు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులకు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు ఇచ్చింది.