తారక్ మాస్ అనుకుంటే క్లాస్ లుక్ ఇచ్చాడే..!

Wednesday, September 12th, 2018, 06:08:28 PM IST

ఈ రోజు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు అరవింద సమేత చిత్రం నుంచి ఒక ఆసక్తికర అప్డేట్ ఇస్తున్నాం అని ఆ చిత్ర బృందం ఒక పోస్టర్ని విడుదల చేస్తాం అన్నారు. అయితే అభిమానులు అందరూ ఎదో మంచి మాస్ మసాలా లుక్ ని వదలబోతున్నారు అనుకున్నారు. అయితే ఆ చిత్ర బృందం వారు దానికి భిన్నం గా ఒక మంచి సింపుల్ క్లాసీ లుక్ ని విడుదల చేసారు.

ఐతే ఈ లుక్ ని వారు రేపు “వినాయక చవితి” పర్వదినం సందర్భంగా విడుదల చేశారు ఈ లుక్ లో తారక్ చాలా ఫ్రెష్ గా చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు చూడని తారక్ ని ఐతే మీరు ఈ చిత్రం లో చూడొచ్చు. రాయలసీమ నేపధ్యం లో అయినా సరే ఈ చిత్రంలో తారక్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మాస్ లుక్ అనుకున్న అభిమానులు ఈ స్టైలిష్ పోస్టర్ ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆ పోస్టర్ ని మీరు కూడా చూసెయ్యండి.

  •  
  •  
  •  
  •  

Comments