కల్కీ ఆశ్రమాలలో ఎంత డబ్బు దొరికిందో తెలిస్తే షాక్..!

Saturday, October 19th, 2019, 12:44:52 AM IST

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ అక్రమాస్తులపై గత రెండు రోజుల నుంచి తమిళనాడులోని కల్కి ఆశ్రమంతో సహా మరో 44 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐటీ దాడుల్లో వారికి సంబంధించిన ఆశ్రమాలలో భారీ ఎత్తున నగదు బయటపడింది. దాదాపు 500 కోట్ల దేశ, విదేశీ కరెన్సీ ఉన్నట్తు అధికారులు తెలిపారు.

అయితే కల్కి భగవాన్ కుమారుడు కృష్ణాజీ కార్యాయంలో ఐటీ దాడులు జరిపిన అధికారులు పెద్ద షాక్ తిన్నారు. అక్కడ భారీ ఎత్తున వజ్రాలు, బంగారం, స్వదేశీ,విదేశీ కరెన్సీ ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 5 కోట్లు విలువ చేసే వజ్రాలు, 26 కోట్లు విలువ చేసే 88కేజీల బంగారం, 40 కోట్ల నగదుతో పాటూ 18 కోట్ల విదేశీ కరెన్సీ అధికారులకు దొరికింది. మొత్తం 93 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు ఆయన దగ్గర 500 కోట్లకు పైగా ఆస్తులకు లెక్కలేవని తెలిసింది.