నల్ల డబ్బు ఎవరి ఎకౌంటు లో వేసినా దొరికిపోతారు

Saturday, November 19th, 2016, 01:04:59 PM IST

money
మేము లైన్ లలో నిలబడి డబ్బులు మార్చుకుంటాం , కష్టపడి డిపాజిట్ లు వేసుకుంటాం కానీ బ్లాక్ మనీ వార భరతం పట్టండి అంటున్నారు ఈ దేశ ప్రజలు. వారి కోరిక తీర్చడం కోసం మోడీ తనదైన శైలి లో అందరినీ బయటకి లాగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కట్టలు కట్టలుగా దాచుకున్న డబ్బుని ఇతరుల ఖాతాల్లో వేసేస్తున్నారు పన్ను ఎగవేత దారులు. సో ప్రతీ లావాదేవీ మీదా పోలీసులు, ప్రభుత్వం, ఐటీ వారూ కన్నేశారు. అన్ని లావాదేవీలపైన నిఘా ఉంచామని, ప‌న్ను ఎగ‌వేత‌దారులు ఇటువంటి చ‌ర్య‌ల‌కు దిగితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. మ‌రోవైపు, సామాన్యులు ఇత‌రుల డ‌బ్బుని త‌మ ఖాతాలో వేసుకొని ఖాతాల దుర్వినియోగానికి పాల్ప‌డితే ఇన్‌కం ట్యాక్స్ చట్టం కింద వారు కూడా విచార‌ణ ఎదుర్కోకత‌ప్ప‌ద‌ని పేర్కొంది. న‌ల్ల‌ధ‌న నిర్మూల‌న‌కు దేశ ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.