ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి కష్టంగా ఉండేది: కీర్తి సురేష్

Sunday, May 6th, 2018, 03:28:56 PM IST

మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సావిత్రి బయోపిక్ మహానటి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ నటన ఏ విధంగా ఉంటుందా అని అందరూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మహానటి పాత్రకు ఆమె ఎంత వరకు న్యాయం చేసిందనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాలో పాత్ర తనకు చిరకాలం గుర్తుండి పోతుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి వివరించింది.

ఒకసారి షూటింగ్ కు ప్యాకప్ చెప్పగానే పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా కష్టంగా ఉండేది. సినిమా చేసిన తరువాత సావిత్రి గారిపై ఉన్న గౌరవం ఇంకాస్త పెరిగిందని సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందనే నమ్మకం తనకుందని కీర్తి సురేష్ వివరించారు. మే 9న రిలీజ్ కానున్న మహానటి రిలీజ్ కు అన్ని ఏర్పాట్లను రెడీ చేసుకుంది. నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాను వైజయంతి – స్వప్న సినిమాస్ వారు నిర్మించారు. సమంత – విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Comments