జనసేనాని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకు మద్దతు ఇవ్వకూడదు..కారణాలు ఇవే.!

Sunday, August 25th, 2019, 08:13:07 PM IST

ఏపీ రాజకీయాల్లోకి సమూలమైన ప్రక్షాళన చెయ్యాలని రాజకీయాల్లో ఒక కొత్త మార్పును తీసుకురావాలని కోటి ఆశలతో జనసేన పార్టీతో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.కానీ అనూహ్యంగా తాను కూడా పోటీ చేసిన రెండు చోట్లా గెలుపొందలేక పోయారు.ప్రత్యర్ధ పార్టీలు వేసిన వ్యూహాలను సమర్ధవంతగా ఎదుర్కోలేక చతికలపడ్డారు.అయినా కానీ ఏమాత్రం కూడా బెణకకుండా అధికారంలో లేకుండా ఎలా తన పనులు చేసుకుంటూ వెళ్లారో ఇప్పుడు కూడా అదే పంథాలో కొనసాగుతూ రాష్ట్ర ప్రజల సమస్యలపై విశ్లేషణ చేపట్టారు.

అయితే జనసేనాని ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నా తాను మళ్ళీ ఓటమి తర్వాత సమీక్షా సమావేశాలు అంటూ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో తమతో కలిసి పని చేసేందుకు జాతీయ పార్టీల వారు ఆసక్తి చూపుతున్నారని ఒక్క మాట అన్నారు.అంతే ఇక అక్కడ నుంచి పవన్ వారికి మద్దతు ఇస్తున్నారు వీరికి మద్దతు ఇస్తున్నారని కొంతమంది అయితే ఏకంగా విలీనం కూడా చేసేస్తారని తప్పుడు వార్తలు కూడా ప్రచురించారు.ఈ వార్తలను అన్నిటిని ఖండిస్తూ తాను ఏ పార్టీలో కూడా జనసేనను కలపనని తేల్చి చెప్పేసారు.

ఇదిలా ఉండగా ఎక్కువగా అయితే పవన్ బీజేపీకు సపోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మొదటి నుంచి తీవ్రమైన కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్న పవన్ ఆ పార్టీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ ఇవ్వరు.ఇక మిగిలి ఉన్న మరో ముఖ్య పార్టీ బీజేపీ.దీనికే పవన్ సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతా అన్నారు.అయితే పవన్ కానీ ఇదే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు పట్టిన గతే మళ్ళీ పడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.దీనికి కొన్ని బలమైన కారణాలు కూడా చాలానే ఉన్నాయి.

గడిచిన ఎన్నికల్లో పవన్ టీడీపీతోనే కలిసి ఉన్నారన్న ఒక్క మాటను వైసీపీ వాళ్ళు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేనకు పడాల్సిన ఓట్లు వారికి వేయించుకున్నారు.చాలా మంది పవన్ అభిమానులే వైసీపీ ఓట్ వేశామని కూడా చెప్పారు.ఈ దెబ్బ మాత్రం జనసేన పార్టీకు మాములుగా తగల్లేదు.ఇప్పుడు పొరపాటున కానీ పవన్ బీజేపీకు మద్దతు ఇచ్చారా ఇదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుంది.ఇప్పుడు బీజేపీ మొత్తం టీడీపీ నేతలను వారి పార్టీలోకి లాక్కుంటున్నారు.గతంలో పవన్ మాతోనే కలిసి ఉన్నారు అని చెప్పిన టీడీపీ నేతలంతా బీజేపీలోనే ఉన్నారు.

ఇక్కడే మళ్ళీ వీరంతా చంద్రబాబు డైరెక్షన్ లోనే బీజేపీలో చేరుతున్నారని వైసీపీ నేతలు మరో కోణాన్ని చిత్రీకరిస్తున్నారు.అంటే బీజేపీ పరోక్షంగా మరో టీడీపీ అనే రకమైన ప్రచారాన్ని వీరు చేస్తున్నారు.ఈ సందర్భంలో కానీ పవన్ పొరపాటున బీజేపీకి మద్దతు ఇస్తున్నా అని ప్రకటన చేస్తే అది మళ్ళీ వైసీపీకు చాలా ప్లస్ అవుతుంది.దానితో వారు మళ్ళీ పవన్ బీజేపీలో ఉన్న టీడీపీకే సపోర్ట్ చేస్తున్నారని గట్టి దెబ్బ ఖచ్చితంగా కొడతారు.అందువల్ల చావో రేవో పవన్ ఒక్కడే పోరాటం చేస్తే మంచిది.మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.