జూన్ నుండి అక్కడ లాక్ డౌన్ ఎత్తివేత…అసలు కారణం ఇదే!

Sunday, May 17th, 2020, 06:29:42 PM IST


కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు పిట్టల్లా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ మాహ్మరి కారణంగా లక్షల ప్రజలు మరణిస్తున్నారు. ఈ వైరస్ సోకి బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుండి కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనలు కలిగించిన ఇటలీ లో ఇపుడు కరోనా వైరస్ దూకుడు తగ్గు ముఖం పట్టింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ మూడవ తేదీ నుండి ఆ దేశం లాక్ డౌన్ ను ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తిన్న కారణంగా ఆ దేశం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాక టూరిజం శాఖ నుండి ఆ దేశానికి 13 శాతం ఆదాయం వస్తుంది. అయితే జూన్ మూడు నుండే దేశ వ్యాప్తంగా అన్ని రంగాల వ్యాపారాలు మళ్లీ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన రాకపోకలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక మునుపటి లాక్ డౌన్ కార్యకలాపాలు యధావిధగా కొనసాగే అవకాశం ఉంది. అయితే కరోనా వైరస్ సృష్టించిన భీభస్తం కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 30 వేలకు పైగా మరణించారు.