అఫీషియల్ : సూపర్ స్టార్ మహేష్ నెంబర్ వన్

Thursday, April 5th, 2018, 07:02:35 PM IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుకు తెలుగులోనే కాదు నార్త్ ఇండియా అలానే ఓవర్సీస్ లోను తిరుగులేని అభిమానులు వున్నారు. ఆయన బాలీవుడ్ సినిమాలు చేయాలి కానీ ఆయనకు అమాంతం అభిమానగణం పెరగటం నిజంగా ఏమంత కష్టం ఏమి కాదనే చెప్పాలి. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ హీరో లుక్స్, స్టైల్, అలానే అంతకు మించి ఎటువంటి క్యారెక్టర్ అయినా చేయగల దమ్ము ఆయనకు మాత్రమే సొంతం. ఇక 2014, 2015 సంవత్సరాలకు దేశ వ్యాప్తంగా మోస్ట్ ‌డిజైరబుల్‌ మెన్ టాప్‌ లిస్ట్‌లోనూ ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే తాజాగా ఆయన మరో మైలురాయిని అందుకున్నారు. ఆయన ట్విటర్‌ అకౌంట్‌ను అనుసరించే వారి సంఖ్య 6 మిలియన్లకు చేరింది. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి హీరో ఆయనే.

ఈ విధంగా చూస్తే టాలీవుడ్ మొత్తం లో ఈ ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరో మన సూపర్ స్టార్. ఈ విషయం లో మాత్రం ఆయనను నెంబర్ వన్ అని చెప్పక తప్పదు. అయితే మహేశ్‌బాబు ఆయన బావ, ఎంపీ గల్లా జయ్‌దేవ్‌ ఒక్కరినే ఫాలో అవుతుండటం విశేషం. ఇక దగ్గుబాటి రానా, అక్కినేని నాగార్జునను అనుసరిస్తున్న వారి సంఖ్య 5 మిలియన్లకు పైనే ఉంది. ప్రముఖ కథానాయకులు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌లను అనుసరిస్తున్న వారి సంఖ్య 4 మిలియన్లుగా ఉంది. మహేశ్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భరత్‌ అను నేను’ చిత్రంలో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా ఈ చిత్రం ఆడియో వేడుకను భరత్ బహిరంగ సభ పేరిట ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు….