హీరో విశాల్ ఇంట .. పెళ్లి బాజాలు ?

Thursday, November 24th, 2016, 11:30:25 PM IST

vishal
అదేంటి .. విశాల్ పెళ్లి అప్పుడే అయిపోతుందా ..ఈ మద్యే కదా వరలక్ష్మి తో బ్రేక్ అప్ చెప్పేసాడు .. అప్పుడే మరో అమ్మాయిని చూ సుకున్నాడా ఇంతకీ ఎవరా అమ్మాయి ? అంటూ షాక్ అవ్వకండి .. హీరో విశాల్ ఇంట్లో పెళ్లి బాజాలు అంటే .. అయన పెళ్లి చేసుకుంటున్నాడని కాదు .. బాస్ .. ? విశాల్ చెల్లి పెళ్లి చేస్తున్నాడు ? అది విషయం. హీరోగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశాల్ ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. లేటెస్ట్ గా ”ఒక్కడొచ్చాడు” చిత్రంలో తమన్నా తో కలిసి నటిస్తున్న విశాల్ చెల్లి ఐశ్వర్య వివాహం సెట్ అయింది. అయితే ఆమె కూడా గత కొన్ని రోజులుగా కృతేష్ అనే యువకుడితో ప్రేమలో ఉందట .. ఇప్పుడు అతగాడినే పెళ్లి చేసుకుంటుంది. వీరి వివాహం వచ్చే ఏప్రిల్ లో జరగనుంది .. అయితే ప్రస్తుతం నిశ్చితార్థం జరుపుతున్నారు. అది విషయం !! మరి చెల్లి పెళ్లి అయిపోగానే విశాల్ కూడా పెళ్ళికి సిద్ధం అవుతాడేమో చూడాలి !!