యాక్సిడెంట్ నుండి తప్పించుకున్న జబర్దస్త్ యాక్టర్!

Tuesday, June 12th, 2018, 03:14:12 PM IST

ప్రస్తుతం బుల్లితెరపై నవ్వుల కనువిందు చేస్తున్న షోల్లో ఎంతో పేరు పాపులారిటీ సంపాదించినా షో ఏదని ఎవరిని అడిగినా, దాదాపుగా అందరూ చెప్పే పేరు ఒక్కటే. అదే ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం అని. ఈ ప్రోగ్రాం వచ్చిన తర్వాత కొన్ని ఇటువంటి తరహా కామెడీ షోలు వచ్చినప్పటికీ ఈ షో మాత్రం వీక్షకుల మదిలో చెరగని ముద్రవేసిన విషయం తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే, నేడు ఈ షోలో పాల్గొని మంచి పేరు చూరగొన్న వారిలో చలాకి చంటి ఒకరు. ఆయన నేడు ఒక పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం 44వ నుంబర్ జాతీయ రహదారిపై చంటి ప్రయాణిస్తున్న కారుని హఠాత్తుగా వెనుకనుండి వేగంగా దూసుకొచ్చిన మరొక కారు బలంగా ఢీకొట్టింది.

అంతే ఒక్కసారిగా రెండుకార్లు చాలా వరకు ధ్వంశం అయ్యాయని సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఆ పెను ప్రమాదం నుండి తప్పించుకుని యాక్టర్ చలాకి చంటి మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కాగా ప్రమాద ఘటన విషయమై సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ చంటికి ప్రస్తుతం డాక్టర్లు ప్రధమ చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియవలసి ఉందని పోలీస్ లు చెపుతున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments