చిరంజీవి ఇంటికి తగలబోతున్న రాజధాని సెగ.. ధర్నాకు రెడీ..!

Thursday, February 27th, 2020, 04:18:29 PM IST


ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని 70 రోజులుగా రాజధాని గ్రామాల రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. అయితే రాజధాని రైతుల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్ధతు తెలుపుతున్నా, ఇప్పటి వరకు మాత్రం ఈ సమస్యపై టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరు స్పందించలేదు.

అయితే రాజధాని అమరావతి పోరాట సెగ చిరంజీవి ఇంటికి తగలబోతుంది. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేయాలని అమరావతి పరిరక్షణ సమితి యువజన జేఏసీ నిర్ణయించింది. ఈ నెల 29వ తేదిన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే రాజధాని అమరావతి పోరాటానికి చిరంజీవి మద్ధతు తెలపాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది.