రిస్కీ ఫైట్స్‌లో స‌ల్మాన్‌కే చెమ‌ట‌లు పోయిస్తుందిట‌!

Wednesday, January 10th, 2018, 10:50:28 AM IST

ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్‌లో సినిమాల స‌ర‌ళి మారింది. ముఖ్యంగా భారీ యాక్ష‌న్ సినిమాల్లో హాలీవుడ్ త‌ర‌హాలోనే క‌థానాయిక‌ల‌కు ప్రాధాన్య‌త పెరిగింది. రేస్ సిరీస్‌.. ధూమ్ సిరీస్‌ స‌హా భారీ యాక్ష‌న్ సినిమాల‌న్నీ కేవ‌లం హీరోల ప్రాధాన్య‌త‌తోనే కాకుండా నాయికా ప్రాధాన్య‌త‌తోనూ ర‌న్ అవుతున్నాయి. వీటిలో హీరోల‌కు ధీటుగా హీరోయిన్‌లు భారీ యాక్ష‌న్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు.

మొన్న‌టికి మొన్న రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద 300 కోట్లు వ‌సూలు చేసిన టైగ‌ర్ జిందా హై చిత్రంలో స‌ల్మాన్‌కి ధీటుగా పోటీప‌డుతూ క‌త్రిన చేసిన యాక్ష‌న్ ఫీట్లు జ‌నాల‌కు పిచ్చిగా న‌చ్చేశాయి. క్రిటిక్స్ ఓ రేంజులో క‌త్రిన ప్ర‌తిభ‌ను పొగిడేశారు. టైగ‌ర్ జిందా హైలో సల్మాన్ పాత్ర ఎంత ఇంపార్టెంటో, అంత‌కు మించి క‌త్రిన‌కు ప్రాధాన్య‌త‌నిచ్చి స్క్రిప్టు రాశారు. ధూమ్ 3, బ్యాంగ్ బ్యాంగ్ వంటి చిత్రాల్లోనూ క్యాట్ ఇదే తీరుగా అద్భుత‌మైన ఫైట్స్‌తో ఆక‌ట్టుకుంది. ఇక క‌త్రిన బాట‌లోనే తాప్సీ నామ్ ష‌బానా చిత్రంలో ఫైట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ కంగ‌న క్వీన్, రంగూన్ త‌ర‌హా యాక్ష‌న్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంది. ఇదే త‌ర‌హాలో మ‌రో భామ యాక్ష‌న్ క్వీన్‌గా మార‌బోతోంది. స‌ల్మాన్ స్నేహితురాలు జాక్విలిన్ ఫెర్నాండెజ్ `రేస్ 3`లో అదిరిపోయే ఛాలెంజింగ్ రోల్‌లో న‌టించ‌నుందిట. ఈ సినిమాకి సంత‌కం చేసిన వెంట‌నే జాక్విలిన్ ప్ర‌త్యేకించి మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందుతోంది. త‌న కెరీర్‌లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఈ అమ్మ‌డు ప్రిప‌రేష‌న్‌లో ఉందిట‌. ఇక క‌త్రిన స్ఫూర్తితో ఈ భామ ఈ చిత్రంలో అదిరిపోయే ఫైట్స్ చేయ‌బోతోందిట‌. రేస్ 3లో స‌ల్మాన్ కు ధీటుగా ఈ అమ్మ‌డి రోల్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జాక్విలిన్‌ కిక్ బాక్సింగ్, మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ పొందుతోంది. `బాలి` (ఇండోనేసియా)లో ఫ్యామిలీతో ఉంటూనే, మార్ష‌ల్ ఆర్ట్స్‌లో శిక్ష‌ణ తీసుకుంటోంది. ఈ భారీ యాక్ష‌న్ చిత్రానికి రెమో డిసౌజా ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. స‌త్తా చాట‌డ‌మే ధ్యేయంగా శ్రీ‌లంక‌న్ బ్యూటీ శిక్ష‌ణ తీసుకుంటోంద‌ని తెలుస్తోంది.