బుల్లితెరపై నెగిటివ్ పాత్రలో జగ్గు భాయ్ ?

Thursday, April 19th, 2018, 01:48:51 PM IST

ఫ్యామిలీ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఆ హీరో ఏకంగా విలన్ గా మరి ప్రస్తుతం సౌత్ లో క్రేజీ ఆర్టిస్ట్ గా ఇమేజ్ తెచ్చుకున్న జగపతి బాబుకు ఇప్పుడు అవకాశాలు క్యూ కట్టాయి. ఈ మద్యే బాలీవుడ్ లోకూడా విలన్ గా అవకాశాన్ని అందుకున్న అయన ఈ సారి బుల్లితెరపై కూడా విలన్ పాత్రలో కనిపిస్తాడట. తాజాగా అమెజాన్ వీడియో కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేసారు. ఈ సిరీస్ లో అయన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తాడని తెలిసింది. అజయ్ భుయాన్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సిరీస్ త్వరలోనే షూటింగ్ మొదలు పెడతారట. మొత్తానికి జగ్గూభాయ్ విలన్ గా తన సత్తా చాటుకుంటున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments