ముస్లిం సోదరులకు జగన్ రంజాన్ కానుక.. ఎంత ప్రకటించారో తెలిస్తే షాక్..!

Saturday, June 1st, 2019, 05:31:51 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం కూడా చేసారు. అయితే ఏపెలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన జగన్ పాలనలో స్పీడ్ పెంచాడు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

అయితే ఇప్పటికే సీఎంగా పెన్షన్ల పెంపు, ఉద్యోగాల ప్రకటన వంటివి ప్రకటించి అందరి మన్ననలు అందుకున్నాడు. అయితే తాజాగా ముస్లిం సోదరులకు కూడా రంజాన్ సందర్భంగా ఒక శుభవార్తను ప్రకటించారు. రంజాన్ సోదరులకు పండుగా కానుకగా ఏకంగా ప్రభుత్వం తరపున రూ. 5 కోట్లు ప్రకటించారు. జిల్లాల వారిగా విడుదల చేసిన ఈ మొత్తం సొమ్ము మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున ఈ నిధులను విడుదల చేస్తున్నానని చెప్పాడు జగన్. దీనిపై ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఉత్తర్వులు జారీచేసింది. అంతేకదు ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చీ రాగానే తమకోసం ఆలోచించి 5 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌కు ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.