ఏపీలో కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టిన జగన్

Wednesday, August 14th, 2019, 03:00:03 AM IST

తెలంగాణాలో అదికారంలోకి వచ్చాక త్తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, తెలంగాణ ప్రజలందరికి కూడా అసలు కంటి చూపు సమస్యలను లేకుండా చేయడమే లక్ష్యంగా గత సంవత్సరంలో కటి వెలుగు పథకాన్ని ప్రారంభించి, విజయవంతంగా అందరికి కంటి చూపును ప్రసాదించి, అందరికి కళ్లద్దాలు కూడా పంపినే చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇంకా అవసరమైన వారందరికీ కూడా తప్పనిసరిగా శస్త్రచికిత్స కూడా చేశారు. రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలు వాడుతున్నారు. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఎంతో మంది తమ కంటి చూపుని తిరిగి పొందారు. కాగా ఎంతో మందికి అవసరమైన ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టడానికి ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారని సమాచారం.

అయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికి కూడా మంచి కంటి చూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి “వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు” పథకానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. కాగా ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి అక్టోబర్ 10 నుంచి రాష్ట్రంలోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈమేరకు ప్రజలందరికి కూడా నేత్ర నిపుణుల సమక్షంలో కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకోసం ప్రత్యేకమైన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలందరికి కూడా కంటి పరీక్షలను నిర్వహించి, అందరికి సరైన చూపు అందించేందుకు సిద్ధమయ్యారు.