ముఖ్య‌మంత్రే వెన్నుపోటు పొడిచారు!

Friday, January 27th, 2017, 12:19:18 AM IST

jagan-chandra-babu
ప్ర‌త్యేక హోదాను ముఖ్య‌మంత్రి స్వ‌యంగా నీరు గార్చారని విమ‌ర్శించారు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌. చంద్ర‌బాబు డెమ‌క్ర‌సీని ప‌ట్ట‌ప‌గ‌లే ఖునీ చేశారు, ముఖ్య‌మంత్రే వెన్నుపోటు పొడిచారని దుయ్య‌బ‌ట్టారు. విశాఖ బీచ్‌లో క్యాండిల్ ర్యాలీ చేయాల‌నుకున్న జ‌గ‌న్‌ని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుని తిరిగి హైద‌రాబాద్ పంపేసిన సంద‌ర్భంలో జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. గాంధేయ‌విధానంలో శాంతియుతంగా క్యాండిల్ లైట్ ర్యాలీని చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. చంద్ర‌బాబు ఇలా చేశారు. తిరుప‌తి, అనంత‌పురం, విశాఖ అన్నిచోట్లా పిల్ల‌ల‌పై అక్ర‌మ‌కేసులు పెట్ట‌డం, వేల‌మందిని అరెస్టులు చేయ‌డం, నాయ‌కుల్ని హౌస్ అరెస్ట్ చేయ‌డం.. త‌మ్మినేని సీతారం వంటి సీనియ‌ర్ నేతల్ని కూడా జీపుల్లో తోసి తీసుకెళ్ల‌డం ఇవ‌న్నీ చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నులేనా?

ఎయిర్‌పోర్టులో దిగుతుంటే ఉన్న ఐదారుగురినే ర‌న్‌వేపైనే పోలీసులు అట‌కాయించారు. దిగిన వెంట‌నే వంద‌ల‌కొద్దీ పోలీసులతో ఎయిర్‌పోర్టులోకి ఎంట‌ర్ కాకుండానే ర‌న్‌వే పైనా ఆపేయ‌డం.. అమానుషం. ఒక ప్యాసింజ‌ర్ .. టిక్కెట్టు కొన్న వారికి డొమ‌స్టిక్ అరైవ‌ల్ గ్యాట్ నుంచి పోయే హ‌క్కు ఉంటుంది. ఎవ‌రైనా ఆపాలి అనుకుంటే ఎయిర్‌పోర్ట్‌లో స్టేట్ పోలీస్‌కి అధికార‌మే లేదు. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంటు జుడిస్టిక్ష‌న్ ప‌రిధిలోనిది. అధికారం, హ‌క్కు లేక‌పోయినా మోహ‌రించ‌డం.. ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట‌ర్ కాకుండా అడ్డు త‌గ‌ల‌డం .. దారుణం… అంటూ జ‌గ‌న్ బాబుపై ఫైర‌య్యారు. రెండేళ్లే ప్ర‌జ‌ల‌పై ఈ భారం. ఎవ‌రూ కేసుల‌కు భ‌య‌ప‌డొద్దు. రెండేళ్ల త‌ర్వాత మా ప్ర‌భుత్వం వ‌స్తుంది. పెట్టిన కేసుల‌న్నీ తీసేస్తాం. భ‌య‌ప‌డొద్దు.. హోదాని ఖునీ చేస్తున్న బాబును దేవుడే కాదు ప్ర‌జ‌లు కూడా క్ష‌మించ‌రు. ఆయ‌న్ని బంగాళాఖాతంలో క‌లిపేస్తారు.. అంటూ సీరియ‌స్ అయ్యారు జ‌గ‌న్‌.