సీఎం జగన్ క్రేజ్ పక్క రాష్ట్రాలలో కూడా పెరిగిపోతుందిగా..!

Tuesday, August 20th, 2019, 08:17:33 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులలోనే పాలనలో అనేక మార్పులు తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అవినీతి రహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడం, పాలనపై పెద్దగా పట్టు లేకపోవడంతో సీఎంగా జగన్ ఏ మేరకు రాణిస్తారో అని అందరూ అనుకున్నారు. ఇక ప్రతిపక్షాలు ఏమో జగన్ పాలన గురుంచి అర్ధం చేసుకునే లోపే సగం సమయం గడిచిపోతుందని విమర్శలు చేసింది. అయితే జగన్ అధికారం చేపట్టిన ఈ కొద్ది రోజులలోనే సీన్ కాస్త రివర్ అయిపోయింది. ఏపీలో ఆశావర్కర్లకు జీతాల పెంపు, పోలవరం రీటెండరింగ్, పిన్షన్ల పెంపు, అధిక సంఖ్యలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వనిటిని మించి ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల అమలు దేనికదే ప్రత్యేకమని చెప్పాలి. అయితే ఇప్పుడు జగన్ పాలనను చూసి పెద్ద పెద్ద రాజకీయ అనుభవజ్ఞులు కూడా పాలన అంటే జగన్‌లా ఉండాలని కితాబు ఇస్తున్నారట. పక్క రాష్ట్రం అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జగన్ పాలనకు ఫిదా కావడం, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు కూడా జగన్‌పై పలు సందర్భాలలో ప్రశంసలు కురిపించడం, పక్క రాష్టం అయిన తమిళ నేతలు కూడా జగన్‌పై ప్రశంసలు కురిపించడం చూస్తుంటే జగన్ పాలన ఏ విధంగా ఉందో ఇట్టే అర్ధమవుతుంది.

అయితే తాజాగా ఒడిసా ముఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న గ్రామ వాలంటీర్ పోస్ట్‌లను ఒడిసాలో కూడా అమలు చేస్తే గ్రామాల్లో పాల‌న‌ను మ‌రింత మెరుగుపరచవచ్చు అని అక్కడి అధికారులతో నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారట. అంతేకాదు అవినీతి నిర్మూలనపై కూడా తనకు పూర్తి నివేదికలను అందచేయాలని కోరాడట. ఏపీ సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలపై ఆయన కూడ ప్రశంసలు కురిపించాడు. ఏది ఏమైనా జగన్ పాలనను ఇంత మంది మెచ్చుకుంటున్నారంటే మరి కొద్ది రోజులలో దేశవ్యాప్తంగా జగన్ క్రేజ్ మరింత పెరిగిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.