జగన్ కేబినేట్‌లో నలుగురు మంత్రులకు చెక్.. కారణమేంటో తెలుసా..!

Thursday, July 11th, 2019, 08:25:50 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తున్నాడు.

అయితే జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన నెలరోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు కురిపించుకుంటున్నాడు. అంతేకాదు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా వెలికితీస్తూఒ అవినీతి పాలనకు పూర్తి విరుద్ధంగా మారిపోయాడు. అయితే కొద్ది రోజుల క్రితం సొంత పార్టీలోనే అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్న కొంత మంది ఎమ్మెల్యేలకు, మంత్రులకు వార్నింగ్ ఇచ్చాడు జగన్. అయితే జగన్ మాటలను పట్టించుకోకుండా కొంత మంది మంత్రులు తమ వైఖరిని మార్చుకోవడంలేదట. అయితే ప్రస్తుతం జగన్ కంట్లో నలుగురు మంత్రులు ఉన్నారు. వీరిలో ఓ మహిళా మంత్రి కూడా ఉండడం విశేషం.

అయితే మహిళా మంత్రికి సంబంధించిన శాఖలో ఆవిడ భర్త పెత్తనం ఎక్కువైపోయిందట. అధికారులను ఇబ్బంది పెట్టడం, ఏ ఏ పనికి ఎంత ఇస్తారు అని అధికారులను అడగుతున్నారని స్వయంగా ఆ శాఖకు చెందిన అధికారులే జగన్ దృష్టికి తీసుకువచ్చారట. అయితే మరో సీనియర్ మంత్రి తన సొంత జిల్లాలో ఏదైనా తన కనుసైగల్లోనే జరగాలని నేను ఆదేశాలు జారీ చేస్తేనే పనులు జరగాలని, ఎమ్మెల్యేల మాట కూడా వినవలసిన అవసరం లేదని చెప్పడంతో మంత్రి అనుచరులు దందాలకు తెర లేపారట. ఇక మరో మంత్రి ఆ పని చేయాలంటే రెండుకోట్ల రూపాయలు ఖ‌ర్చుల కింద ఇవ్వాల‌ని చెప్పార‌ని, మరో మంత్రి ఓ విద్యా సంస్ధ విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని అరోపణలు జగన్ దగ్గరకు వచ్చాయి. అయితే వీరిని ఇదివరకే పిలిచి వార్నింగ్ ఇచ్చినా వారి వ్యవహార శైలి మార్చుకోకపోవడంతో ఇక వారిని కేబినెట్ నుంచి సాగనంపడమే బెటర్ అని జగన్ భావిస్తున్నారట. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఆ నలుగురిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలుస్తుందంటూ పార్టీ వర్గాలలో చర్చలు నడుస్తున్నాయట.