బ్రేకింగ్ : రాధా విషయంలో చేసిన తప్పే జగన్ మళ్ళీ చేసారా?

Friday, June 14th, 2019, 03:14:25 PM IST

రాజకీయాల్లో ఒకరికి న్యాయం చెయ్యాలి అంటే మరొకరికి అన్యాయం చెయ్యక తప్పదు.పరిస్థితులు కారణాలు ఏవైనా సరే ఏదొకలా అవతల వారికి అన్యాయం తప్పదు.అలాగే గత ఏడాది వంగవీటి రాధా విషయంలో జగన్ చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ చేశారా? అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.విజయవాడ సెంట్రల్ సీటును జగన్ ఆశించిన సంగతి తెలిసిందే.అయితే అప్పుడు అదే సీటుకోసం ఆ మధ్యనే కొత్తగా పార్టీలోకి చేరిన మల్లాది విష్ణుకు జగన్ ఆ సీటు కట్టబెట్టడం రాధా మరియు వంగవీటి అభిమానుల్లో పెద్ద దుమారాన్ని రేపింది.

పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ కు విధేయులుగా ఉండి పార్టీ నిర్మాణం కోసం కష్టపడితే తనకు సీటు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో అప్పుడు జగన్ పై వారు వ్యతిరేకతను కనబర్చారు.అలాగే అదే సమయంలో కొత్త వారికోసం సీనియర్ నాయకులను జగన్ పక్కన పెట్టి వారికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని మరో వాదన కూడా ఆ సమయంలో వినిపించింది.అయినా సరే జగన్ అవేవి పట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు తన క్యాబినెట్ మంత్రి వర్గం విషయానికి వచినట్టైతే మళ్ళీ అలాంటి తప్పే చేసారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు.అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్టయితే అక్కడ జగన్ కేవలం ఇద్దరికి మాత్రమే అందులోను ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రుల పదవులు కట్టబెట్టడం వారికి నచ్చలేదట.కొత్తగా పార్టీలోకి చేరిన శంకర్ నారాయణకు మంత్రి పదవి అప్పగించడం అక్కడ మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులకు నచ్చలేదట.అందుకనే జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడ మిగతా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.