అసలు జగన్ ప్లాన్ ఏంటీ.. ఎందుకు అలా చేయబోతున్నాడో తెలుసా..!

Saturday, June 1st, 2019, 11:00:55 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ ఎన్నికలలో టీడేఎపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే మూడు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నిర్వహిస్తానని కూడా చెప్పారు. అయితే ముందుగా పెన్షన్లను పెంచుతున్నట్టు ప్రమాణస్వీకారం రోజునే జీవోని కూడా విడుదల చేశారు.

అయితే ఈ పెన్షన్ పథకానికి గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్‌టీఆర్ భరోసా అనే పేరు ఉండేది. అయితే జగన్ ఆ పేరును మార్చి వైఎస్సార్ పెన్షన్ పథకం అని నామకరణం చేశారు. అయితే తాజాగా మరో పథకానికి కూడా వైఎస్సార్ పేరును ఖరారు చేశారు. ఏపీలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి వైఎస్‌ఆర్ అక్షయపాత్రగా పేరును పెట్టేశారు. అంతేకాదు ఇందులో పనిచేస్తున్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని రూ. 3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్ ఇలా అన్ని పథకాలకు తన తండ్రి గారి పేరును పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు చాలా పథకాలకు స్వర్గీయ ఎన్‌టీఆర్ పేరును పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఆ పథకాలను పొందిన అర్హులందరూ ఎన్‌టీఆర్ పేరును తలుచుకుని ఆయన చేసిన సేవలను గుర్తు పెట్టుకుని వారందరూ టీడీపీకి ఎప్పటికి చెదిరిపోని ఓటు బ్యాంకింగ్‌లా ఉంటారని చంద్రబాబు ఈ పనికి పూనుకున్నారట. అయితే ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో ఆలోచించి తన తండ్రి వైఎస్సార్ పేరును, ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఎప్పుడూ గుర్తించుకునేలా ఉండాలంటే ఇప్పుడు వారికి అందించబోయే అన్ని పథకాలకు వైఎస్సార్ పేరును ఖరారు చేయాలని నిశ్చయించుకున్నారట. దీని వలన తన తండ్రి గారి పేరు ప్రజలలో అలాగే నిలిచిపోతుంది మరియు వైసీపీకి ఓటు బ్యాంకింగ్ కూడా పెరుగుతుంది అని జగన్ భావిస్తున్నారట. ఏది ఏమైనా చంద్రబాబు ప్లాన్‌లకు ధీటుగా ప్లాన్స్ వేస్తున్న నూతన ముఖ్యమంత్రి జగన్‌ని చూస్తుంటే పార్టీలోని సీనియర్లు కూడా ఈయన ఆలోచనలకు సలాం కొడుతున్నారట.