పవన్, బాబు, జగన్..ఆ కామన్ పాయింటే నాశనం చేస్తోంది..!

Friday, September 23rd, 2016, 08:28:51 PM IST

babu-jagan-pawan
చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా వీరి గురించే మాట్లాడుకోవాలి.ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసినా దీనిగురించి రగడ ఇంకా జరుగుతూనే ఉంది.ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వక పోవడానికి విశ్లేషకులు కారణాలు వెతికే పనిలో పడ్డారు.పవన్, చంద్రబాబు, జనగ్ లోని ఓ కామన్ పాయింట్ ఏపీ ని అభివృద్ధికి దూరం చేస్తోందని అన్నారు.

ఆ కామన్ పాయింట్ ఏంటంటే వారు ముగ్గురు మోడీకి భయపడతారు..ఇది సత్యం అని విశ్లేషకులు వాదిస్తున్నారు.వీరిముగ్గురిలో ఏ ఒకరు ధైర్యం చేసి మోడీకి ఎదురునిలిచినా ఏపీకి ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసు వ్యవహారంలో వెనక్కు తగ్గుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఒకవేళ తాను మోడీతో గొడవ పెట్టుకుంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి- వైసీపీలు కలిసే అవకాశం ఉందని అలా జరగనివ్వకూడదనేది చంద్రబాబు ఆలోచనగా విశ్లేషకులు చెబుతున్నారు.

మరవైపు జగన్ కూడా తానకున్న ఆర్థిక పరమైన కేసుల విషయంలో భయపడుతున్నాయనే వాదన ఉంది. వైసిపి మీద టిడిపి.. టిడిపి మీద వైసిపి విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. కానీ ఇంతవరకు జగన్ మోడీని ప్రత్యేక హోదా విషయం లో నిలదీయలేదనే వాదన ఉంది. ఈ విషయం లో జగన్ ఓ ప్రతిపక్ష నేతగా పూర్తిగా విఫలం చెందారని విశ్లేషకులు అంటున్నారు. కేవలం చంద్రబాబుని నిందించగానే ప్రతిపక్ష నేత పని పూర్తవ్వదని అంటున్నారు.ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థికి కేంద్రం సాయం లేనిదే ముందుకు కదిలే ప్రసక్తి లేదు.అలాంటి తరుణంలో జగన్ కేంద్రంపై కూడా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. కానీ జగన్ అలా చేయడం లేదు.

మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అని పార్టీలకు ఆంటీ ముట్టనట్టు ఉన్నారు.కొన్ని రోజుల క్రితం కాకినాడ, తిరుపతి లలో జరిగిన సభలలో ఆయన ప్రత్యేక హోదా పై పోరాడతానని చెప్పినా కార్యాచరణను మాత్రం ప్రకటించలేదు. ప్రత్యేక హోదా విషయం లో వెంకయ్య నాయుడు పై పవన్ విరుచుకుపడ్డారు.కానీ మోడీ జోలికి మాత్రం పవన్ వెళ్ళలేదు. 2019 లో పవన్ బీజేపీ సాయాన్ని ఆశిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అపవాన్ కు మోడీ కి మంచి సాన్నిహిత్యం ఉంది కాబట్టి పవన్ దానిని పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేరనేది విశ్లేషకుల వాదన. ఏది ఏమైనా అందరిదీ ఒకటే లోపం.. అదే మోడీకి భయపడడం.ఇది ఉన్నన్ని రోజులు ఎపి అభివృద్ధి చెందడం కష్టమనేది విశ్లేషకుల వాదన.