హాట్ టాపిక్ : మధ్యలో జగన్ అభిమానులే వెర్రివాళ్ళా..?

Tuesday, October 8th, 2019, 05:28:48 PM IST

ఈసారి ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన తర్వాత కూడా వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.మొదట్లో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి భారీ ఎత్తున వలసలు ప్రారంభం కాగా ఇప్పుడు కాస్త తగ్గాయి.కానీ ఇప్పుడు వైసీపీలోకి భారీ ఎత్తున వలసలు వెళ్తున్నాయి.తాజాగా టీడీపీకు చెందిన ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తెలుగుదేశం పార్టీను వీడి మళ్ళీ వైసీపీలోకి చేరి జగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు.

అయితే టీడీపీ నుంచి ఎవరెవరు వచ్చి వైసీపీలో చేరుతున్నారో వారంతా గతంలో జగన్ పై దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారే బొత్స దగ్గర నుంచి ఇప్పుడు చేరిన జూపూడి వరకు జగన్ ను ఎన్నో రకాల మాటలు మాట్లాడి ఇప్పుడు అదే పార్టీ పంచన చేరారు.అయినా జగన్ వారిని చేర్చుకుంటున్నారు.దీనితో జగన్ అభిమానులకు ఇవి నచ్చడం లేదు.జగన్ ను ఎన్నో తిట్లు తిట్టిన వారిని అసలు ఎందుకు చేర్చుకుంటున్నాడా అని ఒకింత ఆశ్చర్యపోతున్నారు.

ఫలానా నేత వైసీపీలో చేరబోతున్నాడు అన్న వార్త వస్తే చాలు మా పార్టీలోకి వద్దంటే వద్దు ఇతడు మా జగన్ అన్నను ఇతడు అపుడు ఇది అన్నాడు అది అన్నాడు అంటూ గుడ్డలు చించుకుంటారు.కింద స్థాయిలో వీరు వీరు తన్నుకు చస్తారు కానీ పై స్థాయిలో మాత్రం వారు ఎన్ని మాటలు అనుకున్నా సరే మళ్ళీ నవ్వుతూ కలిసిపోతారు.ఫైనల్ గా వెర్రి వాళ్ళు అయ్యేది మాత్రం ఇలా అత్యుత్సాహం చూపే అభిమానులే.