జగన్ అభిమానుల దగ్గర ఈ సంచలన ప్రశ్నకు సమాధానం ఉందా?

Tuesday, June 11th, 2019, 01:09:00 PM IST

ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఏమో కానీ రాజకీయాలకు సంబంధించి మూడు పార్టీల సోషల్ మీడియా విభాగాలు గట్టిగానే పోరాడుతున్నాయి.ముఖ్యంగా ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అయితే మరీను..ఇప్పుడు తాజాగా వైసీపీ మరియు జనసేన శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున విమర్శల పర్వం లేవనెత్తుతుంది.ఎన్నికలు ఎలాగో ముగిసాయి ఫలితాల అనంతరం వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.అంతా అయ్యిపోయింది అనే సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఒక్కడిని ఓడించేందుకు వైసీపీ వారు ఒక్క భీమవరంలోని దగ్గరకి 155 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపాయి.

కొంతమంది ప్రముఖులు పవన్ ఇలా మాట్లాడి ప్రజలను చులకనగా చూస్తున్నారని అంటుండగా మరో పక్క వైసీపీ వారు కూడా డబ్బులు తీసుకొనే ఓటు వేసేవారు అయితే ఓటర్లు వారికి నచ్చిన వారికే ఓటు వేస్తారని కేవలం పవన్ ఓటమికి డబ్బులే ప్రధాన కారణం అని ఎలా చెప్పగలరని ఒక లాజికల్ ప్రశ్నను వేయగా దానికి జనసేన శ్రేణలు కూడా డబ్బులు ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి గతంలో మీ వైసీపీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డే చెప్పారని వారికి వీడియోతో సమాధానం ఇస్తున్నారు.

గతంలో నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ అధినేత జగనే అక్కడ వైసీపీ ఓటమికి తెలుగుదేశం పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టిందని అన్నారు.ఇది అందరికీ తెలిసిన విషయమే,మరి అలాంటప్పుడు జగన్ అంటే ఎవరూ ప్రశ్న వేయలేనిది పవన్ తన ఓటమికి 150 కోట్లు ఖర్చు చేసారు అంటే ఎందుకు తప్పు పడుతున్నారని పెద్ద ఎత్తున ప్రశ్నలు వేస్తున్నారు.అప్పుడు జగన్ అంటే అందులో తప్పు లేదు ఇప్పుడు పవన్ అంటే తప్పు వచ్చిందా అని అంటున్నారు.మరి దీనిపై జగన్ అభిమానులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.