ఈ ఒక్క దెబ్బతో జగన్ పై అభిమానుల్లో తిరుగుబాటు మొదలయింది..!

Wednesday, October 9th, 2019, 06:57:27 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు అసలైన రాజకీయాలు మొదలు అవుతున్నాయి.కాలం మారుతుండడంతో ప్రజల్లో కూడా కాస్త చైతన్యం మొదలయ్యింది. తాము అభిమానించే నాయకుడు ఏం చేసినా సరే ఆహా ఓహో అని జేజేలు పలికే వారే ఇప్పుడు ఆలోచనల్లో పడ్డారు.ప్రస్తుత రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా యువత రాజకీయాల కోసం ఎక్కువగా చర్చించుకుంటున్నారు.దీనికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత పవన్ అని చెప్పాలి.

ఈయన ఏపీ రాజకీయాల్లో కలుగ జేసుకున్నాకే ఇతర పార్టీల యువత కూడా వీరితో మాట్లాడ్డం మొదలు పెట్టారు.అయితే జనసేన తర్వాత యువతలో బలమున్న పార్టీ వైసీపీ.ఎవరు ఏమనుకున్నా సరే వైసీపీను సపోర్ట్ చేసే వారు కానీ జగన్ అభిమానులు కానీ వారికి ఆ పార్టీకు కానీ జగన్ కు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వారిలో వారికే తెలీదు.అవతలి వారు ఏదైనా పాయింట్ అడిగితే దానికి సమాధానం కూడా ఇవ్వకుండా జై జగన్ అని అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు.ఇది అక్షర సత్యం.అయితే ఇలాంటి వారే కాకుండా వైసీపీలో పాయింట్స్ మాట్లాడే వారు కూడా ఇప్పుడు జగన్ వ్యవహార శైలి చూసి ఇప్పుడిప్పుడే తిరుగుబాటు మొదలుపెట్టారు.

జగన్ ను ఇతర పార్టీల్లో ఉన్నప్పుడు ఎన్నో మాటలు అన్నవారిని జగన్ నవ్వుతూ పార్టీలోకి చేర్చుకోవడం వీరికి అంతగా నచ్చడం లేదు,ఇదొక్కటే కాకుండా జగన్ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారా అన్న ఆలోచనలో వీరు ఇప్పుడు పడ్డారు.జగన్ గెలుపు కోసం సోషల్ మీడియా విభాగం వారు రేయింబవళ్లు కష్టపడ్డారు అలాంటి వారికి కనీసం జగన్ చిన్న అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వకపోగా జగన్ ను ఎన్నో బండ బూతులు మాట్లాడిన జూపూడి వంటి వారిని పార్టీలోకి చేర్చుకోవడం వంటివి చూసి తాము ఇప్పుడిప్పుడే తిరుగుబాటు మొదలుపెట్టారు.మొత్తానికి జగన్ తన వైఖరి వల్లనే తన అభిమానులకు తానంటే ఒక అభిప్రాయం వచ్చేలా చేసుకున్నారని చెప్పాలి.