ఇప్పుడిప్పుడే బయట పడుతున్న జగన్ అభిమానులు.!

Thursday, October 10th, 2019, 08:12:45 AM IST

ఇప్పుడు వైసీపీ పార్టీలో పరిస్థితులు ఒక్కసారిగా అడ్డం తిరిగేలా ఉన్నాయి.తమ ప్రాణం అనుకోని భావించిన జగన్ అభిమానులే జగన్ అసలు రంగు ఏమిటా అన్నది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు.గత రెండు రోజుల క్రితం వైసీపీ పార్టీలోకి జూపూడి చేరడంతో ఈ అలజడులు మొదలయ్యాయి.అసలు జగన్ ఎందుకు ఇలాంటి వారిని తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారన్న ఆలోచనే వీరికి కలచి వేస్తూ మింగుడుపడడం లేదు,ఇతనొక్కడే కాదు జగన్ మీద ఎంతో దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారి అందరికి జగన్ నవ్వుతూ తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.వాళ్ళు రావొద్దు అని వీరు సోషల్ మీడియాలో నెత్తి నోరు కొట్టుకొని చివరికి వెర్రి వాళ్ళు అవుతున్నారు.

ఇలాంటి వారై అందరికి చోటు కల్పిస్తున్న జగన్ అరే తమ పార్టీ కోసం జగన్ కోసం కష్ట పడ్డ యువతకు మాత్రం న్యాయం చెయ్యకపోవడం కనీసం ఎన్నికలు అయ్యిన తర్వాత వారిపై గతంలో పెట్టబడిన కేసులు తీసేస్తారని భావించినా అలాంటి చర్యలు ఏవి జగన్ చెయ్యకుండా కనీసం వారి కోసం పట్టించుకోకుండా అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం వంటివి చూస్తుంటే ఇన్నాళ్లు ఇలాంటి విలువలు లేని పార్టీ కోసం రేయింబవళ్లు కష్టపడ్డామా అని వారిలో వారే ఇప్పుడు చింతిస్తున్నారు.మొత్తానికి జగన్ అభిమానులు ఇప్పుడిప్పుడే అసలు రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో తెలుసుకొని బయటపడుతున్నారని చెప్పాలి.