బిగ్ బ్రేకింగ్ : వైసీపీలో రోజాకు కీలక స్థానం ఫిక్స్ చేసిన జగన్.?

Saturday, June 1st, 2019, 10:20:27 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ ప్రమాణ స్వీకారం అనంతరం ఒక రకమైన కన్ఫ్యూషన్ వైసీపీ క్యాడర్ లో ఇంకా కొనసాగుతూనే ఉంది.జగన్ మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది అన్నది ఇప్పుడు ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు కానీ తాజాగా మాత్రం కొంత మంది పేర్లు ఖరారు అయ్యాయని వార్తలు మాత్రం బయటకు వస్తున్నాయి.వారి పేర్లు ఎంత వరకు ఖరారు అవుతాయో తెలీదు కానీ అదే పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాకు మాత్రం కీలక పదవిని జగన్ కేటాయించినట్టు తెలుస్తుంది.

అసెంబ్లీ సమావేశాలు అంటే స్పీకర్ తప్పని సరి అందుకనే జగన్ ఆలోచించే రోజా కు ఈ భాద్యతను అప్పగిస్తున్నట్టు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఈ వార్త ఊపందుకుంది.ఎలాగో అసెంబ్లీ సమావేశాలు కూడా అతి త్వరలోనే మొదలు అవుతాయి.అందువల్ల జగన్ ఎవరికి ఏ పదవులు అప్పగించారో ఇంకొంత కాలం ఆగితే తెలిసిపోతుంది కదా అని మరి కొంత మంది వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.మరి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం రోజా స్పీకర్ స్థానంలో కూర్చుంటారో లేదో చూడాలి.