వరదలపై అమెరికా నుండే సమీక్ష నిర్వహిస్తున్న జగన్

Sunday, August 18th, 2019, 01:27:56 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి అమెరికా పర్యటనలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఆంద్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరదలతో అతలాకుతలమవుతున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ కృష్ణ నది వరదలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమెరికా నుంచి ఫోన్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈమేరకు సీఎంవో అధికారులు పంపిన నివేదికలను అమెరికాలో జగన్మోహన్ రెడ్డి నిశితంగా పరిశీలించారు. కాగా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరదలు,విడుదల చేస్తున్నటువంటి జలాలపై ఆరా తీశారు… అంతేకాకుండా ముంపు ప్రాంతాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై జగన్ ఆరా తీసి, బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి అలసత్వం వద్దని జగన్‌ అధికారులను చాలా సీరియస్ గా హెచ్చరించారని సమాచారం.

కాగా ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు, చాలా చురుగ్గానే జరుగుతున్నాయని సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివరించారు. అంతేకాకుండా ప్రస్తుతానికి వరదలు తగ్గుతున్నాయని, ఇకమీదట ఎలాంటి సమస్యలు ఉండవని సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివరించారు. కాగా ప్ప్రస్తుతానికి వాషింగ్టన్‌ డీసీలో ఉన్న సీఎం జగన్‌ అక్కడ నుంచి డల్లాస్ కి వెళ్లనున్నారు. కాగా డల్లాస్ కి చేరుకున్న జగన్ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రముఖలను కలుసుకొని పలు కీలకమైన అంశాలను సంబంధిత అధికారులతో చర్చలు జరపనున్నారు.